RRR Movie: ఆర్ఆర్ఆర్ సినిమా ఆఫర్ ను తిరస్కరించి..ఇప్పుడు బాధపడుతున్న బాలీవుడ్ అందగత్తెలు

బాహుబలి ఫేమ్ దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమా బాక్సాఫీసులో కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. సినిమా తొలివారంలోనే 7 వందలకోట్లు వసూలు చేసిన...చరిత్ర సృష్టించింది. జూనియర్ ఎన్టీఆర్, రామ్‌చరణ్, అలియా భట్, అజయ్ దేవగణ్ వంటి నటులతో సినిమా తెరకెక్కింది. అయితే ఇతర హీరోయిన్లకు కూడా ఆఫర్ చేసినా..తిరస్కరించారట. ఆ నటీమణులెవరో చూద్దాం
  • Apr 02, 2022, 17:00 PM IST

RRR Movie: బాహుబలి ఫేమ్ దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమా బాక్సాఫీసులో కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. సినిమా తొలివారంలోనే 7 వందలకోట్లు వసూలు చేసిన...చరిత్ర సృష్టించింది. జూనియర్ ఎన్టీఆర్, రామ్‌చరణ్, అలియా భట్, అజయ్ దేవగణ్ వంటి నటులతో సినిమా తెరకెక్కింది. అయితే ఇతర హీరోయిన్లకు కూడా ఆఫర్ చేసినా..తిరస్కరించారట. ఆ నటీమణులెవరో చూద్దాం

1 /5

ఆర్ఆర్ఆర్ సినిమాలో సాహో ఫేమ్ శ్రద్ధా కపూర్‌కు జూనియర్ ఎన్టీఆర్ సరసన ఆఫర్ వచ్చింది. కానీ శ్రద్ధా బిజీ షెడ్యూల్ కారణంగా తిరస్కరించింది.

2 /5

ఇక ఈ సినిమాలో భూమిక పాత్రలో పరిణితి చోప్రాను తీసుకుందామనుకున్నారు. కానీ ఎందుకో వర్కవుట్ కాలేదు.   

3 /5

ఒలీవియా మోరిస్ స్థానంలో కత్రినా కైఫ్ సోదరి ఇసాబెస్ కైఫ్‌ను సంప్రదించారు. కానీ ఆమె తిరస్కరించింది. సినిమా కధ, వివరాల కోసం ఆమె డిమాండ్ చేసిందని..అందుకే వెనక్కి పోయిందని తెలుస్తోంది.

4 /5

ఇక మరో నటి ఎమీ జాక్సన్‌ను కూడా ఆర్ఆర్ఆర్ నిర్మాతలు ట్రై చేశారు. కానీ ఆమె ప్రెగ్నెంట్ అని తెలిసి డ్రాప్ అయ్యారు. 

5 /5

ఆర్ఆర్ఆర్ సినిమాలో అలియా భట్, ఒలీవియా మోరిస్ ప్రధాన నటీమణుల్లా మెరిసిపోతున్నారు.