Pudina Benefits: భారతీయులు తమ వంటల్లో ముందుగా కరివేకాకు,పుదీనా, కొత్తి మీరలకు ప్రత్యేక స్థానం ఉంది. దాదాపు అన్ని వంటకాల్లో ఈ మూడు ఉండాల్సిందే. వీటిలో దేని ఉపయోగం దానిదే. కానీ పుదీనాకు ప్రత్యక ఔషధ గుణాలు కొన్ని రోగాలను మన దగ్గరకు రాకుండా చేస్తాయనేది డాక్టర్లు చెబుతున్న మాట.
రోజు పుదీనా తింటే ఈ లాభాలు మీ సొంతం..ఆ రోగాలకు చెక్..
పుదీనాలో విటమిన్ ఏ, సీ, బీ6 ఐరన్, కాల్షియం, మెగ్నీషియం, మాంగనీసు, ఫోలేట్ వంటి పుష్కలంగా ఉంటాయి.
పుదీనా ఆకులు నమిలితే నోరు ఆరోగ్యకరంగా ఉంటుంది. అంతేకాదు చిగుళ్లు, దంతాల ఆరోగ్యం బాగుంటుంది.
పుదీనాలోని ఔషధ గుణాలు జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తాయి. కడుపులో ఉబ్బరం, గ్యాస్ నుంచి ఉపశమనం లభిస్తోంది.
పుదీనాలో యాంటీ ఇన్‌ఫ్లేమటరీ గుణాలు ఉంటాయి. ఇవి అలెర్జీ,అస్తామా వంటి శ్వాస సంబంధ సమస్యల నుంచి బయటపడతారు.
పుదీనాలోని యాంటీ యాక్సిడెంట్స్ చర్మాన్ని రక్షిస్తాయి. ఫ్రీ రాడికల్స్ నుంచి చర్మాన్ని రక్షిస్తుంది.