BMW R 1250 GS Price: బీఎండబ్ల్యూ కంపెనీ నుంచి 2 స్పోర్ట్స్ బైక్స్‌, ధర చూస్తే షాక్

  • Jul 11, 2021, 16:37 PM IST

బీఎండబ్ల్యూ కంపెనీ రెండు స్పోర్ట్స్ బైక్స్‌ను భారత మార్కెట్లోకి తీసుకొచ్చింది. బీఎండబ్ల్యూ ఆర్ 1250 జీఎస్ (BMW R 1250 GS), బీఎండబ్ల్యూ ఆర్ 1250 జీఎస్ అడ్వెంచర్ (BMW R 1250 GS Adventure) అనే రెండో రకాల బైక్స్ లాంఛ్ చేసినట్లు బీఎండబ్ల్యూ ఇండియా ప్రెసిడెంట్ విక్రమ్ పవాహ్ తెలిపారు.

1 /5

బీఎండబ్ల్యూ ఆర్ 1250 జీఎస్ (BMW R 1250 GS), బీఎండబ్ల్యూ ఆర్ 1250 జీఎస్ అడ్వెంచర్ (BMW R 1250 GS Adventure) బైక్స్ ఎల్ఈడీ అడాప్టివ్ హెడ్‌లైట్ డిజైన్‌తో రూపొందించారు. ఎక్స్ ఆకారంలో లైట్ ఐకాన్స్ అమర్చారు. లైట్లకు సంబంధించిన క్రషింగ్ లైట్ మరియు ఇంటిగ్రేటెడ్ టర్న్ ఇండికేటర్ బల్బులను ఫిక్స్ చేసింది.  Also Read: WhatsApp Features: మీరు వాట్సాప్ వాడుతున్నారా, అయితే ఈ సరికొత్త ఫీచర్లు మీకోసమే

2 /5

భారత్‌లో బీఎండబ్ల్యూ ఆర్ 1250 జీఎస్ ప్రో ధర (BMW R 1250 GS Price) రూ.20,45,000 (20 లక్షల 45 వేల రూపాయాలు). బీఎండబ్ల్యూ ఆర్ 1250 జీఎస్ అడ్వెంచర్ బైక్ ధర (BMW R 1250 GS Adventure Price) రూ.22,40,000 (22 లక్షల 40 వేల రూపాయాలు)  Also Read: EPFO Medical Advance: గంటలో ఈపీఎఫ్‌వో మెడికల్ అడ్వాన్స్‌గా రూ.1 లక్ష సాయం

3 /5

ఆటోమొబైల్ దిగ్గజం భారత్‌లో బీఎండబ్ల్యూ ఆర్ 1250 జీఎస్ మరియు భారత్‌లో బీఎండబ్ల్యూ ఆర్ 1250 జీఎస్ అడ్వెంచర్‌లను బిల్ట్ అప్ యూనిట్స్‌గా విక్రయిస్తున్నట్లు బీఎండబ్ల్యూ ఇండియా ప్రెసిడెంట్ విక్రమ్ పవాహ్ పేర్కొన్నారు.

4 /5

భారత్‌లో బీఎండబ్ల్యూ ఆర్ 1250 జీఎస్ (BMW R 1250 GS) మరియు బీఎండబ్ల్యూ ఆర్ 1250 జీఎస్ అడ్వెంచర్ బైక్ (BMW R 1250 GS Adventure) రెండు రంగులలో అందుబాటులోకి తెచ్చింది. ట్రిపుల్ బ్లాక్ వేరియంట్ మరియు స్టైల్ ర్యాలీ వేరియంట్‌లలో లభిస్తుందని కంపెనీ తెలిపింది.  40 ఇయర్స్ జీఎస్ ఎడిషన్ కింద పరిమిత సంఖ్యలో స్టాక్ అందుబాటులోకి తెచ్చారు. Also Read: Samsung Galaxy F22 Price In India: భారత మార్కెట్లోకి శాంసంగ్ గెలాక్సీ ఎఫ్22 రిలీజ్, ధర, ఫీచర్ల వివరాలు

5 /5

బీఎండబ్ల్యూ ఆర్ 1250 జీఎస్ (BMW R 1250 GS) మరియు బీఎండబ్ల్యూ ఆర్ 1250 జీఎస్ అడ్వెంచర్ (BMW R 1250 GS Adventure) వేరియంట్ బైకులపై 3 సంవత్సరాల వారంటీ లభిస్తుంది. ఎన్ని కిలోమీటర్లు నడిపినా ఈ వారంటీ వర్తిస్తుందని బీఎండబ్ల్యూ ప్రకటించింది. నాలుగేళ్లు మరియు ఐదేళ్లకు వారంటీ పెంచుకునేలా కస్టమర్లకు అవకాశం కల్పించినట్లు వెల్లడించింది.  స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి. Android Link - https://bit.ly/3hDyh4G Apple Link - https://apple.co/3loQYe మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook