Black Turmeric: నల్ల పసుపు ఎప్పుడైనా చూశారా, ఆరోగ్యానికి అద్భుతమైన ప్రయోజనాలు

Black Turmeric: పసుపు అందరికీ సుపరిచితమైన కిచెన్ ఇంగ్రెడియెంట్. ఆయుర్వేదపరంగా అద్భుతమైన ఔషదమిది.  ప్రతి కిచెన్‌లో వంటలో తప్పకుండా వినియోగించే మూలికా పౌడర్ ఇది. పసుపు లేకుండా వంట పూర్తి కానేకాదు. ఈ పసుపుతో ఆరోగ్యపరంగా చాలా ప్రయోజనాలున్నాయి.

Black Turmeric: అయితే పసుపు రంగు పసుపు గురించి అందరికీ తెలిసిందే. కానీ నల్ల పసుపు ఎవరైనా ఎప్పుడైనా చూశారా. లేకపోతే ఆ నల్ల పసుపు గురించి మేం మీకు వివరిస్తాం. నల్ల పసుపు ఆరోగ్యపరంగా అద్భుతమైన ప్రయోజనాలు కలిగింది. ఆ ప్రయోజనాలేంటో తెలుసుకుందాం..

1 /5

సాధారణ పసుపు లానే నల్ల పసుపు కూడా చర్మానికి చాలా మంచిది. తేనెతో కలిపి నల్ల పసుపు ముఖానికి రాసుకుంటే అద్భుతమైన నిగారింపు వస్తకుంది. ముఖంపై ఉండే నల్లటి మచ్చలు ముడతలు కూడా  తొలగిపోతాయి.

2 /5

ఇటీవలి కాలంలో తక్కువ వయస్సుకే జాయింట్ పెయిన్స్ సమస్యలు బాధిస్తున్నాయి. ఈ సమస్య మరింత ఎక్కువైతే యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఫంగల్ గుణాలు అత్యధికంగా ఉన్న నల్లపసుపుని వినియోగించాలి.

3 /5

ఎక్కడైనా తెగినప్పుడు లేదా చిన్న చిన్ దెబ్బలు తగిలినప్పుడు ఆ ప్రాంతంలో నల్ల పసుపు పౌడర్ వేస్తే అద్భుతమైన యాంటీ బయోటిక్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీగా పనిచేస్తుంది.

4 /5

మెరుగైన జీర్ణక్రియ కడుపు సంబంధిత సమస్యలుంటే నల్ల పసుపు ఉపయోగిస్తే మంచి ఫలితాలుంటాయి.. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. కడుపు నొప్పి, గ్యాస్ సమస్యకు అద్భుతమైన పరిష్కారంగా కన్పిస్తుంది. చేయాల్సిందల్లా నల్ల పసుపు పౌడర్ గ్లాసు నీళ్లలో కలుపుకుని తాగడమే.

5 /5

నల్ల పసుపు అనేది సాధారణంగా దేశంలోని ఈశాన్య రాష్ట్రాల్లో ఎక్కువగా ఉంటుంది. ఆరోగ్యానికి చాలా మంచిది. అదే విధంగా చర్మ సంరక్షణకు ఓ ఔషధంలా పనిచేస్తుంది. ఇంకా ఏయే ప్రయోజనాలున్నాయో పరిశీలిద్దాం..