Bitter Gourd Benefits: కొందరు ప్రతిరోజు ఉదయం పూట కాకర కాయ జ్యూస్ ను తాగుతుంటారు. ఇది శరీరంలో అనేక రకాలైన చెత్తనుబైటకు పంపించేస్తుంది. పొట్టను క్లీన్ గా ఉంచుతుంది.
కాకరకాయలు తినడం వల్ల మన శరీరానికి అనేక ఆరోగ్యప్రయోజనాలు ఉన్నాయి. ఇవి రుచికి చేదుగా ఉన్న కూడా దీని హెల్త్ బెనిఫిట్స్ తెలిస్తే ఆశ్చర్యపోతారు. శరీరంలోని అనేక రకాల బ్యాక్టిరియాలను,వ్యర్థపదార్థాలను బైటకు పోయేలా చేస్తుంది.
శరీరంలో యూరీక్ ఆసిడ్ బైటకు వెళ్లేలా చర్యలుజరుపుతుంది. యూరీక్ లెవల్స్ లలో హెచ్చుతగ్గులు లేకుండా కాపాడుతుంది. బ్లడ్ లో షుగర్ లెవల్స్ ను అదుపులో ఉంచుతుంది. ముఖ్యంగా మధుమేహాంతో బాధపడే వారు కాకరకాయ రసం డైలీతాగాలని నిపుణులు చెబుతుంటారు.
శరీరంలో రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది. కొందరికి అతి చిన్న వయస్సులోనే ముఖంపై ముడతలు, జుట్టు తెల్లగా మారిపోతుంది. ఇలాంటి వారిలో కూడా కాకరకాయ జ్యూస్ తాగుతుంటే ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఒత్తిడిని దూరం చేస్తుంది.
కాకరకాయలో విటమిన్ ఏ, బి,సీ, బీటా కెరోటీన్ లు పుష్కలంగా ఉంటాయి. ఆస్తమా, జలుబు, దగ్గు, శ్వాస సంబందిత సమస్యలున్న వారికి ప్రభావవంతంగా పనిచేస్తుంది. డయాబెటిక్ సమస్యలున్న వారికి ఇది గొప్ప దివ్యషధమని చెబుతుంటారు. షుగర్ హెచ్చు తగ్గులు లేకుండా కంట్రోల్ లో ఉంచుతుంది.
ముఖ్యంగా ప్రెగ్నెంట్ లేడీస్ కాకర కాయను తినొద్దని నిపుణులు చెబుతుంటారు. దీనివల్ల కడుపులో ఉండే పిండానికి ప్రమాదమని చెబుతుంటారు. అందుకే గర్బవతులు కాకరకాయను అవాయిడ్ చేయాలి.
కాలేయానికి సంబంధించిన సమస్యలున్న వారు కూడా కాకరకాయకు దూరంగా ఉండాలని చెబుతుంటారు. దీనిలో ఉండే కొన్నిరకాల ఆమ్లాలు కాలేయం పనితీరుపై చెడు ప్రభావాలను చూపిస్తాయంట. అందుకు వీళ్లుసాధ్యమైనంత దూరంగా కాకరకాయలకు ఉండాలి.Disclaimer: పైన పేర్కొన్న అంశాలు కేవలం ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్నవి వాటినే మేము అందిస్తున్నాము. దీన్ని Zee Mediaధృవీకరించలేదు.)