Airtel: ఎయిర్‌టెల్‌ యూజర్లకు పెద్దదెబ్బ.. ఎక్కువ మంది రీఛార్జ్ చేసుకునే ఈ ప్లాన్‌లో ఇంటర్నెట్ డేటా తొలగింపు..

Big Shock To Airtel Users: ఎయిర్టెల్ యూజర్లకు బిగ్ షాక్ ఇచ్చింది. రూ. 509 రీఛార్జ్ పై ఇంటర్నెట్ డేటాను తొలగించి కీలక ప్రకటన చేసింది. ఇందులో 84 రోజుల వ్యాలిడిటీ కాల్స్ తో పాటు 900 ఎస్ఎంఎస్ లు మాత్రమే యూజర్లు పొందుతారు. గతంలో ఈ ప్లాన్‌పై 6 జీబీ డేటా కూడా పొందేవారు. ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం.
 

1 /5

పెరిగిన టెలికాం ధరల తర్వాత ఎయిర్టెల్ మరోసారి యూజర్లకు బిగ్ షాక్ ఇచ్చింది. రీఛార్జ్ పై ఇంటర్నెట్ డేటా తొలగిస్తూ కీలక ప్రకటన చేసింది.  దీంతో రూ. 509 రీఛార్జి ప్లాన్ పై డేటా యూజర్లు పొందలేరు. ఇది ఎయిర్‌ టెల్‌ వినియోగదారులకు బిగ్‌ షాక్‌ అనే చెప్పవచ్చు.  

2 /5

రూ.509 ఎయిర్టెల్ రీఛార్జ్ పై ఇంటర్నెట్ డేటాను తొలగించడంతోపాటు రూ. 1999 రీఛార్జ్ పై 336 రోజుల పాటు డేటా లేకుండా అపరిమిత కాల్స్, ఎస్ఎంఎస్ లు మాత్రమే లభిస్తాయి. ఈ రీఛార్జ్‌ ప్యాక్‌పై కూడా డేటా తొలగించింది ఎయిర్‌టెల్‌. గతంలో డేటా ఎక్కువ వినియోగించలేనివారు ఈ ప్లాన్‌పై ఎక్కువ మొగ్గు చూపేవారు.  

3 /5

గతంలో ఈ ప్లాన్‌పై 6 జీబీ డేటా వచ్చేది. కానీ ప్రస్తుతం ఆ డేటాను తొలగించేసి ఎయిర్టెల్ యూజర్లకు బిగ్ షాక్ ఇచ్చింది. పెరిగిన టెలికామ్ తర్వాత ఇది యూజర్లకు మరో పిడుగు లాంటి వార్త.  

4 /5

ఎయిర్టెల్ ఈ కీలక ప్రకటన చేయడంతో సోషల్ మీడియా వేదికగా యూజర్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు. రూ. 509 రీఛార్జ్ పై ప్రధానంగా కాలింగ్‌ కోసమే రీచార్జ్ చేసుకునే వారు ఉన్నారు. గతంలో 6 జిబి డేటాను ఈ  రూ.509 రీఛార్జ్ ప్లాన్ పై అందుబాటులో ఉంచేది. 

5 /5

దీంతోపాటు అపోలో 24/7 సబ్స్క్రిప్షన్, హలో ట్యూన్స్ కూడా ఈ ప్లాన్ లో అందుబాటులో ఉండేవి. మొత్తం మీద ఎయిర్టెల్ వినియోగదారులకు పెద్ద దెబ్బ అనే చెప్పుకోవాలి. ఇప్పటికే తమ యూజర్లను కోల్పోయిన ఎయిర్‌టెల్‌ తాజాగా ఈ షాకింగ్‌ నిర్ణయం తీసుకుంది.