Pm Kisan Good News 19th Installement: ఫిబ్రవరి 1వ తేదీ కేంద్రం బడ్జెట్ ప్రవేశ పెట్టనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం రైతులకు తీపి కబురు అందించనుంది. ఇప్పటివరకు 18వ విడుదల పీఎం కిసాన్ యోజన నిధులు మంజూరు చేసిన కేంద్రం, 19వ విడుద పై భారీ ప్రకటన చేసే అవకాశం ఉంది. ఈ సందర్భంగా రైతులు పీఎం కిసాన్ ప్రకటన బడ్జెట్‌లో ఉండనుందని ఎదురు చూస్తున్నారు.
ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన ద్వారా ప్రతి ఏడాది రూ. 6000 రైతులకు మంజూరు చేస్తారు. వారి వ్యవసాయ పెట్టుబడులకు ఆర్థిక చేయూత అందించడానికి ఈ నిధులను మంజూరు చేస్తుంది. మూడు విడతల్లో రూ.2000 చొప్పున ఏటా రూ.6000 విడుదల చేస్తుంది.
అయితే ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం 18 విడతల్లో రైతులకు ఈ చేయూత అందించింది. 2024 అక్టోబర్ 5వ తేదీ 18వ విడుద పిఎం కిసాన్ నిధులను విడుదల చేసింది. ఇప్పుడు 19వ విడుత నిధులను విడుదల చేయనుంది. అయితే ఫిబ్రవరి 1వ తేదీ బడ్జెట్‌లో పీఎం కిసాన్ పై భారీ ప్రకటన చేయనుంది కేంద్రం.
పిఎం కిసాన్ యోజన 2019లో ప్రారంభమైంది. అప్పటి నుంచి ఏడాదికి రూ.6000 రైతుల ఖాతాల్లో డిబిటి ద్వారా ట్రాన్స్ఫర్ అవుతున్నాయి. అయితే ఇప్పుడు ఈ పథకం రూ. 6000 నుంచి లిమిట్ రూ. 12 వేలకు పెరిగే అవకాశం ఉందని నిపుణుల అంచనా వేస్తున్నారు. ఇక ద్రవ్యాలు అధిగమించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన పీఎం కిసాన్ నిధి సమ్మాన్ యోజన ద్వారా ఇప్పటివరకు 11 కోట్ల మందికి పైగా రైతులు లబ్ధి పొందారు. ఈ పథకం దేశవ్యాప్తంగా ఉన్న చిన్న సన్నకారు రైతులకు వర్తిస్తుంది. అయితే 19 విడుద నిధులు ప్రధానమంత్రి ఫిబ్రవరి 24వ తేదీన బీహార్‌ను పర్యటించనున్నారు. అక్కడ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా 19వ విడుదల డబ్బులను విడుదల చేసే అవకాశం ఉంది.
పీఎం కిసాన్ నిధి యోజన ద్వారా బెనిఫిట్స్ పొందాలంటే ముందుగానే కేవైసీ పూర్తి చేసుకోవాలి. జనవరి 31వ తేదీ లోపు ఈ కేవైసీ పూర్తి చేసుకోవాలి. pmkisan.gov.in స్టేటస్ ను కూడా ఆన్లైన్లో చెక్ చేసుకునే సదుపాయం కల్పించింది. కామన్ సర్వీస్ సెంటర్ (CSC) లో కూడా ఈ కేవైసీ పూర్తి చేయవచ్చు లేదా ఆన్లైన్ లో నేరుగా ఈ కేవైసీ పూర్తి చేయాలి.