Big Alert 15 Banks Closed: బ్యాంకు కస్టమర్లకు బిగ్ అలెర్ట్. కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఓ 15 బ్యాంకులు పూర్తిగా మూతపడనున్నాయి. మీ బ్యాంకు ఖాతా ఈ బ్యాంకుల్లోనే ఉన్నాయా? మరి వారి పరిస్థితి ఏంటి? ప్రభుత్వం బ్యాంకుల సంఖ్యను తగ్గించేందుకు ఇలా ఈ బ్యాంకులను మూసి వేస్తోంది. ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం.
మీ ఖాతా గ్రామీణ బ్యాంకుల్లో ఉందా? అయితే, మీకు ఇది బిగ్ అప్డేట్ ప్రభుత్వం రూరల్ బ్యాంకుల సంఖ్యను దేశవ్యాప్తంగా తగ్గించేందుకు 15 బ్యాంకులను మూసి వేయనుంది. వన్ స్టేట్, వన్ రిజియనల్ రూరల్ బ్యాంక్ లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
మన దేశవ్యాప్తంగా ఇప్పటికి 43 రీజియన్ రూరల్ బ్యాంకులు ఉన్నాయి. ఫైనాన్ మినిస్ట్రీ నాలుగో దశ గ్రామీణ బ్యాంకుల విలీనం ప్రారంభించింది. దీంతో వాటి సంఖ్య 28 కు తగ్గించనుంది. అంటే ప్రతి రాష్ట్రంలో కేవలం ఒక్క గ్రామీణ బ్యాంకు మాత్రమే పనిచేయనున్నాయి. అందుకే ఈ విలీన కార్యక్రమం చేపట్టనుంది.
ఫైనాన్స్ మినిస్ట్రీ ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో నాలుగు రిజియనల్ రూరల్ బ్యాంకులు ఉన్నాయి. మధ్య ప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్, కర్నాటక, జమ్మూ కశ్మీర్, బిహార్, ఒడిశా, రాజస్థాన్ లలో రెండు ఆర్‌ఆర్‌బీలు, పశ్చిమ బెంగాల్, ఉత్తర ప్రదేశ్‌లలో మూడు ఆర్‌ఆర్‌బీలు ఉన్నాయి.
ఈ ఆర్‌ఆర్‌బీ విలీనానికి ప్రభుత్వం బ్లూప్రింట్ కూడా రెడీ చేసింది. 2020-21 విలీనం జరిగిన తర్వాత వాటి సంఖ్య 196 నుంచి 43 కు తగ్గింది. ప్రస్తుతం నాలుగో దశ విలీనం తర్వాత వీటి సంఖ్య 28 కు తగ్గనుంది.
బ్యాంకుల ద్వారా లావదేవీలు నిర్వహిస్తారు. ఈ బ్యాంకులు గ్రామీణ ప్రాంతాల్లో అందుబాటులో ఉండేవి. రీజియనల్ రూరల్ బ్యాంకులు దేశవ్యాప్తంగా ఉన్న గ్రామీణ ప్రజలకు బ్యాంకు సేవలు అందించేవి.