Best Foods: చలికాలంలో గర్భిణీలు తప్పక తినాల్సిన 5 ఫుడ్స్ ఇవే

చలికాలం వచ్చిందంటే చాలు ఆరోగ్యపరంగా చాలా అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా గర్భిణీలు ఇంకా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే చలికాలంలో రోగ నిరోధక శక్తి తగ్గిపోతుంటుంది. ఫలితంగా వివిధ రకాల వ్యాధులు చుట్టుముడుతుంటాయి. అందుకే కొన్ని రకాల ఆహార పదార్ధాలు తప్పకుండా తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

Best Foods: చలికాలం వచ్చిందంటే చాలు ఆరోగ్యపరంగా చాలా అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా గర్భిణీలు ఇంకా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే చలికాలంలో రోగ నిరోధక శక్తి తగ్గిపోతుంటుంది. ఫలితంగా వివిధ రకాల వ్యాధులు చుట్టుముడుతుంటాయి. అందుకే కొన్ని రకాల ఆహార పదార్ధాలు తప్పకుండా తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

1 /5

సీడ్స్ బాదం, వాల్‌నట్స్, ఆనపకాయ విత్తనాలతో పాటు విటమిన్ ఇ, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి. 

2 /5

పాలకూర ఇతర ఆకు కూరలు ఆకుకూరల్లో ఐరన్ పెద్దఎత్తున ఉంటుంది. రక్త కణాల నిర్మాణంలో ఉపయోగపడుతుంది. ఇందులో ఫోలేట్, యాంటీ ఆక్సిడెంట్లు పెద్దఎత్తున ఉంటాయి.

3 /5

చేపలు సాల్మన్, సార్డిన్, ట్యూనా వంటి చేపల్లో ఇమ్యూనిటీ సిస్టమ్ సపోర్ట్ చేస్తుంది. శిశువు మస్తిష్కం ఎదుగుదలకు దోహదం చేస్తుంది. హార్ట్ హెల్త్ పెంచుతుంది.

4 /5

చిలకడ దుంప చిలకడ దుంపలో విటమిన్ ఎ పుష్కలంగా ఉంటుంది. ఇది రోగ నిరోధక శక్తి పెంచేందుకు, కంటి చూపుకు దోహదం చేస్తుంది. ఇందులో ఫైబర్ కూడా అధికంగా ఉండటం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఇందులో ఫోలేట్ కూడా ఉంటుంది. 

5 /5

సిట్రస్ ఫ్రూట్స్ గర్భిణీ మహిళలు ఆరెంజ్, ద్రాక్ష, నిమ్మ వంటి పండ్లు తప్పకుండా తీసుకోవాలి. ఎందుకంటే వీటిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది ఇమ్యూనిటీని పెంచి సీజనల్ ఇన్‌ఫెక్షన్లు దరిచేరకుండా కాపాడుతుంది. శిశువు ఎదుగుదలకు దోహదం చేస్తుంది.