Skin Glowing Tips: వయసు మళ్లినా నిత్య యౌవనంతో నిగనిగలాడాలంటే ఏం చేయాలి

ఇటీవలి కాలంలో ఏజీయింగ్ సమస్య చాలా అధికంగా కన్పిస్తోంది. వయస్సు మీరకుండానే చర్మం నిగారింపు కోల్పోతోంది. యౌవన దశలోనే వృద్ధాప్య లక్షణాలు కన్పిస్తున్నాయి. ఒత్తిడి, ఆహారపు అలవాట్లు, నిద్ర లేమి ఇలా చాలా కారణాలున్నాయి. కొన్ని రెమిడీస్ పాటిస్తే తిరిగి నిత్య యౌవనంగా కన్పించవచ్చు. 

Skin Glowing Tips: ఇటీవలి కాలంలో ఏజీయింగ్ సమస్య చాలా అధికంగా కన్పిస్తోంది. వయస్సు మీరకుండానే చర్మం నిగారింపు కోల్పోతోంది. యౌవన దశలోనే వృద్ధాప్య లక్షణాలు కన్పిస్తున్నాయి. ఒత్తిడి, ఆహారపు అలవాట్లు, నిద్ర లేమి ఇలా చాలా కారణాలున్నాయి. కొన్ని రెమిడీస్ పాటిస్తే తిరిగి నిత్య యౌవనంగా కన్పించవచ్చు. 

1 /5

చర్మం సదా యౌవనంగా కన్పించాలంటే పెరుగుతున్న వయస్సుతో పాటు శరీరంలోని ప్రతి భాగంలో చర్మం మార్పు కన్పిస్తుంటుంది. కొంతమందికి మాత్రం వయస్సు పెరిగినా సరే యౌవనంగానే కన్పిస్తుంటారు. సరైన జాగ్రత్తలు తీసుకుంటే ఇది సాధ్యమే. 

2 /5

నీళ్లు ఎక్కువగా తాగడం నీళ్లు, కొబ్బరి నీళ్లు, గ్రీన్ టీ ఎక్కువగా తాగాలి. కీరా ప్రతిరోజూ తినాలి. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని యౌవనంగా ఉంచుతాయి. విష పదార్ధాలు బయటకు వెళ్లిపోతాయి.

3 /5

మంచుతో ఫేస్ మస్సాజ్ ఉదయం లేచిన వెంటనే ఓ గిన్నెలో ఐస్ ముక్కలు లేదా మంచు తీసుకుని ముఖంపై అప్లై చేయాలి. దీనిని స్కిన్ ఐసింగ్ అంటారు. చర్మం టైట్ అవుతుంది. ముడతలుంటే తొలగిపోతాయి. బ్లడ్ వెస్సెల్స్ యాక్టివ్ అవుతాయి.

4 /5

సంపూర్ణ నిద్ర నిద్రించే విధానం కూడా చర్మం ముడతలకు దారితీయవచ్చు. ముఖంపై ముడతలు కన్పిస్తే వెంటనే కొన్ని టిప్స్ పాటించాలి. పక్కకు కాకుండా వీపు ఆధారంగా పడుకోవాలి. అంతేకాకుండా రాత్రి నిద్ర 7-8 గంటలు తప్పకుండా ఉండేట్టు చూసుకోవాలి.

5 /5

ఫేస్ మాస్క్ అప్లై చేయడం అరటి, పెరుగు, ఆరెంజ్ జ్యూస్ కలిపిన మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని 20 నిమిషాలుంచాలి. ఆ తరువాత ముఖం శుభ్రంగా కడగాలి. ఇలా చేయడం వల్ల ముఖం నిగనిగలాడుతుంది.