Best Winter Snacks: చలికాలంలో ఈ స్నాక్స్ తీసుకుంటే ఆ వ్యాధులకు చెక్

చలికాలం వచ్చిందంటే చాలు చాలా సమస్యలు ఎదురౌతుంటాయి. ఎందుకంటే శీతాకాలంలో శరీరంలో ఇమ్యూనిటీ తగ్గిపోతుంటుంది. అందుకే ఈ సమయంలో హెల్తీ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవాలి. ఆహారపు అలవాట్లు బాగుండాలి. చలికాలంలో ఆకలి కూడా ఎక్కువగా ఉంటుంది. అయితే ఫిట్‌నెస్, ఆరోగ్యం కాపాడుకునేందుకు ప్రాధాన్యత ఇవ్వాలి. చలికాలంలో ప్రోటీన్లు, ఫైబర్ అధికంగా ఉండే ఫుడ్స్ తీసుకోవాలి. చలికాలంలో తీసుకోవల్సిన 5 బెస్ట్ స్నాక్స్ గురించి తెలుసుకుందాం.

Best Winter Snacks: చలికాలం వచ్చిందంటే చాలు చాలా సమస్యలు ఎదురౌతుంటాయి. ఎందుకంటే శీతాకాలంలో శరీరంలో ఇమ్యూనిటీ తగ్గిపోతుంటుంది. అందుకే ఈ సమయంలో హెల్తీ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవాలి. ఆహారపు అలవాట్లు బాగుండాలి. చలికాలంలో ఆకలి కూడా ఎక్కువగా ఉంటుంది. అయితే ఫిట్‌నెస్, ఆరోగ్యం కాపాడుకునేందుకు ప్రాధాన్యత ఇవ్వాలి. చలికాలంలో ప్రోటీన్లు, ఫైబర్ అధికంగా ఉండే ఫుడ్స్ తీసుకోవాలి. చలికాలంలో తీసుకోవల్సిన 5 బెస్ట్ స్నాక్స్ గురించి తెలుసుకుందాం.

1 /5

క్యారట్-మటర్  క్యారట్ , మటర్ చలికాలంలో విరివిగా లభిస్తాయి. ఈ రెండు కలిపి తీసుకోవడం వల్ల ఆరోగ్యపరంగా చాలా మంచిది. అద్భుతమైన పోషకాలు లభిస్తాయి. 

2 /5

ఓట్స్ లడ్డూలు ఓట్స్‌లో ఫైబర్, ప్రోటీన్లు అధిక మొత్తంలో ఉంటాయి. ఓట్స్ లడ్డూలో తేనె, డ్రై ఫ్రూట్స్, నెయ్యి కలిపి చేసుకుంటే మరింత ఆరోగ్యం మెరుగుపడుతుంది. క్రేవింగ్ తగ్గుతుంది

3 /5

వేరుశెనగ బెల్లం ఇది అద్భుతమైన కాంబినేషన్. చలికాలంలో ఈ రెండు కలిపి తీసుకంటే చాలా లాభాలున్నాయి. వేరుశెనగలో ప్రోటీన్లు, బెల్లంలో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. ఈ స్నాక్ తీసుకోవడం వల్ల ఇన్‌స్టంట్ ఎనర్జీ లభిస్తుంది. ఇమ్యూునిటీ పెరుగుతుంది.

4 /5

ఫ్రైడ్ శెనగలు ఫ్రైడ్ శెనగల్లో ప్రోటీన్లు, ఫైబర్ అధికంగా ఉండటం వల్ల ఎక్కువ సేపు ఆకలి వేయదు. జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఇందులో ఉండే ప్రోటీన్లు కండరాల ఎదుగుదలకు దోహదం చేస్తాయి. 

5 /5

మఖనా బాదం మఖనాలో ఫైబర్, బాదంలో హెల్తీ ఫ్యాట్ అధికంగా ఉంటాయి. దాంతో ఈ రెండూ కలిపి తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. చాలా వ్యాధులు దూరమౌతాయి. చలికాలంలో ఆరోగ్యానికి మరింత లాభం కల్గిస్తుంది