Best Health, Fitness Apps: ఆరోగ్యానికి, ఫిట్‌నెస్‌కి పనికొచ్చే బెస్ట్ యాప్స్ ఇవే..!

health and fitness apps: ఈ కరోనా కాలంలో మీరు మీ ఆరోగ్యాన్ని ఇంటి దగ్గర నుంచే కాపాడుకోవచ్చు. మెుబైల్ ఫోన్స్ లో ఈ యాప్స్ డౌన్ లౌడ్ చేసుకోని... ఆరోగ్యాన్ని పొందండి. 
 

  • Feb 19, 2022, 11:55 AM IST

health and fitness apps:  ఈ రోజుల్లో ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉండటం చాలా ముఖ్యం. దీని కోసం ఫిట్‌నెస్ క్లబ్‌లో చేరడం, యోగా తరగతులకు వెళ్లడం, జిమ్‌లో చేరడం వంటివి చేస్తుంటా. కానీ కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్నందున జిమ్ లేదా ఫిట్‌నెస్ సెంటర్‌కు వెళ్లటం చాలా ప్రమాదకరం. ఈ నేపథ్యంలో..మీరు మీ స్మార్ట్‌ఫోన్‌లో ఆరోగ్యం, ఫిట్‌నెస్ యాప్స్ ను డౌన్‌లోడ్ చేసుకుని ఇంటి దగ్గర నుంచే వర్కౌట్స్ చేసుకోవచ్చు.  ఆ యాప్స్ ఏంటంటే..గూగుల్ ఫిట్, డైలీ యోగా, జెఫిట్ వర్కౌట్ ట్రాకర్, హెల్తీపైమీ, క్యాలరీ కౌంటర్ మైఫిట్‌నెస్ పాల్. 

1 /5

బరువు తగ్గడంలో మీకు సహాయపడే ఉత్తమమైన ఫిట్‌నెస్ యాప్‌లలో క్యాలరీ కౌంటర్ మైఫిట్‌నెస్ పాల్ ఒకటి.  మీరు ఏమి తినాలి, ఏమి తినకూడదు అనే దాని గురించి కూడా మీకు ఈ యాప్ మార్గనిర్దేశం చేస్తుంది. 

2 /5

మీ ఆరోగ్యం,  ఫిట్‌నెస్ లక్ష్యాలను చేరుకోవడంలో హెల్తీపైమీ యాప్ మీకు సహాయపడుతుంది. హెల్తీపైమీ..వర్కౌట్ ట్రాకర్, వెయిట్ లాస్ ట్రాకర్, వాటర్ ట్రాకర్, ఫుడ్ ట్రాకర్, స్లీప్ ట్రాకర్, హ్యాండ్‌వాష్ ట్రాకర్‌ను సులభతరం చేస్తుంది. 

3 /5

జెఫిట్ వర్కౌట్ ట్రాకర్.. ఇది ఫిట్‌నెస్ ట్రాకర్ యాప్ మాత్రమే కాదు జిమ్ ట్రైనర్ కూడా. వినియోగదారులు చురుకుగా ఉండటానికి సహాయపడే ఉచిత ఫిట్‌నెస్ ప్లాన్‌ ఇందులో ఉంటుంది. ఇందులో 1300 వివరణాత్మక వ్యాయామాలు కూడా ఉన్నాయి. 

4 /5

నిత్యం యోగా చేసే వారు డైలీ యోగా యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుంటే మంచిది. దీని ద్వారా రోజువారీ చిట్కాలు, వేరియేషన్‌లను పొందవచ్చు. అంతేకాకుండా ఈ యాప్‌లో వాయిస్ క్లిప్ ఉంటుంది. అది వినియోగదారుని దృష్టి కేంద్రీకరించేలా చేస్తుంది.  

5 /5

గూగుల్ ఫిట్ అనేది వర్కౌట్ ట్రాకర్ యాప్. ఇది వినియోగదారులకు వేగం, ఎత్తు, మార్గం, నడక, పరుగు మరియు ఇతర కార్యకలాపాలను సూచిస్తుంది. ఇందులో మీరు ఎన్ని కేలరీలు కరిగించారన్నది తెలియజేస్తుంది.