Obesity Remedies: ఇటీవలి కాలంలో స్థూలకాయం అతి పెద్ద సమస్యగా మారింది. స్థూలకాయం అంటే కేవలం బరువు పెరగడమో, శరీర ఆకారం పెరగడమో కాదు..అధిక రక్తపోటు, మధుమేహం, ఆస్తమా, ఒత్తిడి వంటి వ్యాధులకు కారణమౌతుంది. అందుకే స్థూలకాయం లేదా అధిక బరువుతో జాగ్రత్తగా ఉండాలి. స్థూలకాయం సమస్యను కొన్ని చిట్కాలతో చాలా సులభంగా పరిష్కరించవచ్చు.
కరివేపాకు కడుపు చుట్టూ కొవ్వు కరిగించేందుకు కరివేపాకు అద్భుతంగా ఉపయోగపడుతుంది. కరివేపాకుతో కొలెస్ట్రాల్ నియంత్రణలో రావడమే కాకుండా బెల్లీ ఫ్యాట్ కూడా తగ్గుతుంది. దీనికోసం రోజూ ఉదయం ఆహారంలో కనీసం 10 కరివేపాకులు ఉండేట్టు చూసుకోవాలి.
స్థూలకాయంతో పాటు ఇతర వ్యాధులకు చెక్ పెట్టేందుకు ఆయుర్వేదంలో మంచి రెమిడీస్ ఉన్నాయి. ఈ రెమిడీస్ తక్కువ ధరకే అందుబాటులో ఉండటమే కాకుండా ఎలాంటి దుష్పరిణామాలు ఉండవు
నిమ్మరసం స్థూలకాయం తగ్గించేందుకు నిమ్మరసం అద్భుతంగా పనిచేస్తుంది. కడుపుకు సంబంధించిన సమస్యలు ఇట్టే తొలగిపోతాయి. అదనంగా ఉండే కొవ్వు కరుగుతుంది. ఒక గ్లాసు గోరు వెచ్చని నీటిలో సగం చెంచా మిరియాల పౌడర్ , ఒక స్పూన్ తేనె, 3 చెంచాల నిమ్మరసం కలపాలి. రోజూ ఉదయం పరగడుపున తాగితే కేవలం నెలరోజుల్లోనే బరువు వేగంగా తగ్గడం గమనించవచ్చు
వాము నీరు స్థూలకాయం లేదా అధిక బరువు నుంచి విముక్తి పొందేందుకు వాము నీరు అద్భుతంగా పనిచేస్తుంది. వాము నీరు తాగడం వల్ల కడుపు తగ్గుతుంది. జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఒక గ్లాసు నీటిలో 2 చెంచాల వాము కలిపి రాత్రంతా నానబెట్టాలి. ఉదయం లేవగానే పరగడుపున ఆ నీటిలో కొద్దిగా తేనె కలుపుకుని తాగాలి. రోజూ ఇలా చేస్తే కొద్దిరోజుల్లోనే ఫలితం చూడవచ్చు
తేనె దాల్చిన చెక్క స్థూలకాయం తగ్గించేందుకు తేనె దాల్చిన చెక్క అద్భుతమైన చిట్కా. ఈ రెండింటి వల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ కూడా తగ్గుతాయి. గోరు వెచ్చని నీటిలో సగం చెంచా దాల్చిన చెక్క పౌడర్ కలిపిఓ అరగంట వదిలేయాలి. అందులో ఒక స్పూన్ తేనె కలిపి ఉదయం లేవగానే పరగడుపున తాగాలి. లేదా రాత్రి నిద్రపోయే ముందు తాగవచ్చు