Belly Fat Tips: చాలామందికి శరీరం బరువు తగ్గినా కడుపు చుట్టూ ఉండే ఫ్యాట్ అంటే బెల్లీ ఫ్యాట్ మాత్రం తగ్గదు. ఇది కచ్చితంగా చాలా అసౌకర్యం కలుగచేస్తుంటుంది. అయితే కొన్ని చిట్కాలు పాటిస్తే రోజుల వ్యవధిలోనే బెల్లీ ఫ్యాట్ లేదా కడుపు చుట్టూ ఉండే కొవ్వు మాయమౌతుంది. బెల్లీ ఫ్యాట్ సమస్యను ఎలా నిర్మూలించాలో తెలుసుకుందాం.
లో కేలరీ ఫుడ్ వీలైనంతవరకూ లో కేలరీ ఫుడ్ మాత్రమే తీసుకోవాలి. దీనికోసం పండ్లు, కూరగాయలు బెస్ట్. కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉండే ఆహారం తినాలి. పండ్లు, కూరగాయల్లో ఉండే ఫైబర్ కడుపు చుట్టూ ఉండే ఫ్యాట్ తగ్గిస్తుంది.
లీన్ ప్రోటీన్ ఫుడ్ లీన్ ప్రోటీన్ ఫుడ్ ఉదాహరణకు నట్స్, సీడ్స్ తీసుకోవడం వల్ల కడుపు తేలిగ్గా ఉంటుంది. త్వరగా ఆకలేయదు. పంచదార తినాలనే క్రేవింగ్ కూడా తగ్గుతుంది
ఉప్పు తగ్గించడం బెల్లీ ఫ్యాట్ తగ్గించాలంటే ఉప్పుకు దూరంగా ఉండాలి. ఎక్కువ ఉప్పు ఉండే పదార్ధాలు తగ్గించాలి. మార్కెట్‌లో ఉండే ప్యాకెట్ ఫుడ్స్ మానేయాలి.
హిట్ వ్యాయామం హిట్ అనేది ఒక హై ఇంటెస్ వ్యాయామ ప్రక్రియ. కేలరీలు బర్న్ చేసేందుకు అద్బుతంగా పనిచేస్తుంది. ఇందులో ఎనర్జీ ఎక్కువ ఖర్చవుతుంది
వ్యాయామం కడుపు చుట్టూ ఉండే కొవ్వు త్వరగా కరిగించేదుకు వ్యాయామం బెస్ట్. కడుపు కండరాలకు క్రమపద్ధతిలో వ్యాయామం చాలా అవసరం.
షుగర్‌కు నో చెప్పడం బెల్లీ ఫ్యాట్ సమస్యను దూరం చేసేందుకు పంచదార, స్వీట్స్ దూరం పెట్టాలి. కొబ్బరి నీళ్లు వీలైనంత ఎక్కువ తీసుకోవాలి. దీంతో బరువు తగ్గించేందుకు వీలవుతుంది
నీళ్లు తాగడం బెల్లీ ఫ్యాట్ తగ్గించేందుకు రోజూ క్రమ పద్ధతిలో ఎక్కువ నీళ్లు తాగుతుండాలి. నీటి కొరత లేకుండా చూసుకోవాలి. రోజూ కనీసం 8-10 గ్లాసుల నీళ్లు తప్పకుండా తాగాలి