Red Foods for Heart: ఇటీవలి కాలంలో గుండె వ్యాధుల సమస్య అధికంగా ఉంటోంది. వయస్సుతో సంబంధం లేకుండా అన్ని వయస్సువారిని టార్గెట్ చేస్తోంది. అందుకే ఈ సమస్య నుంచి దూరంగా ఉండేందుకు హెల్తీ ఫుడ్ చాలా అవసరం. చెడు ఆహారపు అలవాట్లు, చెడు జీవనవిధానానికి దూరంగా ఉండాలి.
Red Foods for Heart: గుండె సదా ఆరోగ్యంగా ఉండేందుకు కొన్ని రకాల ఫ్రూట్స్ తప్పకుండా తీసుకోవాలి. ముఖ్యంగా ఈ 5 రెడ్ ఫ్రూట్స్ తింటే గుండె వ్యాధులు ఎప్పటికీ దరిచేరవంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఈ 5 రెడ్ ఫ్రూట్స్‌లో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, పోషకాలు పుష్కలంగా ఉంటాయి.
బీట్‌రూట్ బీట్‌రూట్‌లో నైట్రేట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి. ఫలితంగా రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. అంతేకాకుండా ఫోలిక్ యాసిడ్, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది.
రెడ్ షిమ్లా మిర్చి రెడ్ షిమ్లా మిర్చిలో విటమిన్ సి పెద్దఎత్తున ఉంటుంది. ఇది గుండె ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరం. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, పైటోకెమికల్స్ పెద్దఎత్తున ఉంటాయి. ఇవి బీపీని నియంత్రిస్తాయి.
ఆపిల్ ఆపిల్ తినడం వల్ల గుండె ఎప్పటికీ ఆరోగ్యంగా ఉంటుంది. ఎందుకంటే ఇందులో ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి పెద్దఎత్తున ఉంటాయి. కొలెస్ట్రాల్ లెవెల్స్ నియంత్రిస్తుంది. రక్త నాళాల్లో రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. రోజూ ఒక ఆపిల్ తినడం వల్ల గుండె వ్యాధుల్నించి రక్షించవచ్చు
స్ట్రా బెర్రీస్ స్ట్రాబెర్రీస్‌లో కూడా లైకోపీన్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. అంతేకాకుండా ఇందులో ఫైబర్, విటమిన్ సి ఎక్కువగా ఉండటం వల్ల రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. గుండె వ్యాధుల ముప్పును తగ్గిస్తుంది
టొమాటో టొమాటో గుండెకు చాలా మంచిది. ఇందులో ఉండే లైకోపీన్ అనే యాంటీ ఆక్సిడెంట్ గుండె వ్యాధుల ముప్పును తగ్గిస్తుంది. రక్త నాళికల్ని ఆరోగ్యంగా మారుస్తుంది.