IPL 2025 Mega Auction: ఐపీఎల్ 2025 మెగా వేలానికి అంతా సిద్ధమౌతోంది. ఇప్పటికే మొత్తం 10 ఫ్రాంచైజీలు రిటెన్షన్ ఆటగాళ్ల జాబితా విడుదల చేశాయి. ఈసారి ఊహించని రీతిలో ఐదుగురు కెప్టెన్లు వేలానికి సిద్ధం కానున్నారు. ఈసారి ఐపీఎల్ వేలం సౌదీ అరేబియాలోని రియాద్‌లో జరిపేందుకు బీసీసీఐ నిర్ణయించింది. వేలం ఏయే తేదీల్లో జరిగేది కూడా నిర్ణయమైంది.
బీసీసీఐ నిబంధనల ప్రకారం అన్ని ఫ్రాంచైజీలు అక్టోబర్ నెలాఖరుకు తాము రిటైన్ చేసుకున్న ఆటగాళ్ల జాబితా విడుదల చేశాయి. 120 కోట్ల మొత్తం బడ్జెట్లో ఎవరి వద్ద ఎంత డబ్బులు మిగిలాయో తేలిపోయింది. మిగిలిన డబ్బులతో వేలానికి దిగనున్నాయి. దాంతో రానున్న మూడేళ్లకు కొత్త టీమ్స్ స్వరూపం మారిపోనుంది
సౌదీ అరేబియా రాజధాని రియాద్‌లో వేలం ఈసారి ఐపీఎల్ మెగా వేలం ఈ నెలాఖరులో సౌదీ అరేబియా రాజధాని రియాద్‌లో జరిపేందుకు నిర్ణయించారు
నవంబర్ 24, 25 తేదీల్లో వేలం బీసీసీఐ అధికారిక సమాచారం ప్రకారం ఐపీఎల్ వేలం రియాద్‌లో జరగనుంది. అన్ని ఫ్రాంచైజీలకు ఈ మేరకు సమాచారం అందింది. నవంబర్ 24, 25 తేదీల్లో జరపనున్నారు
నవంబర్ 24, 25 తేదీల్లో రియాద్‌లో జరిగే మెగా వేలంలో 204 స్లాట్స్ కోసం వేలం జరగనుంది. దాదాపు అన్ని జట్ల వద్ద చాలా తక్కువ డబ్బు మిగిలింది. కొనాల్సిన స్లాట్స్ ఎక్కువగా ఉన్నాయి.
వేలంలో శ్రేయస్ అయ్యర్, రిషభ్ పంత్, కేఎల్ రాహుల్ ఈసారి వేలం చాలా పెద్దదిగా ఉండనుంది. ఇందులో రిషభ్ పంత్, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, అర్షదీప్ సింగ్, మొహమ్మద్ సిరాజ్, మొహమ్మద్ షమీ వంటి స్టార్ ఆటగాళ్లు వేలంలో ఉంటారు. ఇప్పటి వరకూ 10 ఫ్రాంచైజీలు 46 మందిని రిటైన్ చేసుకున్నాయి. ఈ 46 మంది విలువ 558.5 కోట్లుగా ఉంది