Bank Holiday: రేపు బ్యాంకులు బంద్‌.. అక్టోబర్‌ 26 శనివారం ఎందుకు సెలవు తెలుసా?

Bank Holiday Saturday: రేపు దేశవ్యాప్తంగా ఉన్న అన్ని బ్యాంకులకు సెలవు, దీంతో అన్ని బ్యాంకులు శనివారం అక్టోబర్‌ 26 బంద్‌ ఉండనున్నాయి. దీంతో తిరిగి బ్యాంకులు సోమవారం 28వ తేదీ తెరుచుకుంటాయి. నాలుగో శనివారం కాబట్టి రేపు 26వ తేదీ బ్యాంకులు బంద్‌ ఉండనున్నాయి.
 

1 /5

ఈ నెలలో చాలా రోజులు బ్యాంకులకు సెలవులు వచ్చాయి. ముఖ్యంగా దసరా పండుగ సందర్భంగా ఈ సెలవులు వచ్చాయి.  

2 /5

అయితే సాధారణంగా ప్రతి ఆదివారం, రెండు, నాలుగో శనివారం రోజుల్లో ఆర్‌బీఐ గైడ్‌లైన్స్‌ ప్రకారం బ్యాంకులు బంద్‌ ఉంటాయి.  

3 /5

ఇవి కాకుండా స్థానిక పండుగల నేపథ్యంలో కూడా బ్యాంకులకు సెలవులు వర్తిస్తాయి అయితే రేపు అక్టోబర్‌ 26 నాలుగో శనివారం సందర్భంగా బ్యాంకులు బంద్‌ ఉంటాయి.  

4 /5

ఇక అక్టోబర్‌ 31 కూడా దీపావళి పండుగ సందర్భంగా బ్యాంకులకు సెలవు రానుంది. కొన్ని ప్రాంతాల్లో నవంబర్‌ 1, 2 తేదీల్లో కూడా బ్యాంకులు బంద్‌ ఉండనున్నాయి. ముఖ్యంగా ఈరోజుల్లో లక్ష్మీపూజ, గోవర్ధన పూజ సందర్భంగా బంద్‌ ఉండనున్నాయి.  

5 /5

ఇదిలా ఉండగా రానున్న కాలంలో కేవలం ఐదు రోజులు మాత్రమే బ్యాంకులు పనిచేయనున్నాయి. ఎందుకంటే కేంద్రం బ్యాంకు ఉద్యోగులు కేవలం 5 రోజుల పని విధానాన్ని త్వరలో అమలు చేయనున్నట్లు తెలుస్తోంది.