Kavya Kalyan Ram: బ్లాక్‌డ్రెస్‌లో బలగం‌ పాప సోయగాలు.. మత్తు చూపులతో అదరహో

Kavya Kalyan Ram Pics: గంగోత్రి సినిమాలో నీలి కళ్ళతో మనందరినీ ఎంతగానో మెప్పించిన కావ్య కళ్యాణ్ రామ్ ఈమధ్య బలగం చిత్రంతో హీరోయిన్ గా మారి సూపర్ హిట్ అందుకుంది. కాగా ప్రస్తుతం ఈమె షేర్ చేసిన ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి..

  • Dec 28, 2023, 21:37 PM IST
1 /5

Kavya Kalyan Ram Pics: గంగోత్రి సినిమాలో వల్లంకి పిట్ట అనే పాటలో నీలి కళ్ళ పాప తెలుగు వారందరికీ గుర్తుందే ఉంటుంది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ బాలు సినిమాలో కూడా నటించి మెప్పించింది. ఇలా చైల్డ్ ఆర్టిస్ట్ గానే ఎంతో పేరు తెచ్చుకుంది కావ్య కళ్యాణ్ రామ్. 

2 /5

ఆ తర్వాత కూడా కొన్ని సినిమాలలో చైల్డ్ ఆర్టిస్టుగా చేసిన ఈ నటి.. ఈ మధ్యనే  బలగం చిత్రంతో హీరోయిన్ గా మారింది. ప్రియదర్శికి ఈ సినిమాలో హీరోయిన్ గా చేసి సూపర్ హిట్ అందుకుంది.

3 /5

బలగం సినిమా కన్నా ముందు మసూద సినిమాలో కూడా ఒక ముఖ్యపాత్రలో కనిపించింది కావ్య కళ్యాణ్ రామ్.

4 /5

మసూద, బలగం రెండు కూడా సూపర్ హిట్లను నమోదు చేసుకోగా.. ఈ హీరోయిన్ కి మరిన్ని అవకాశాలు రావచ్చు అని తెలుగు ప్రేక్షకులకు భావిస్తున్నారు.

5 /5

అయితే ఇప్పటివరకు ఇంకా ఎటువంటి పెద్ద సినిమా సైన్ చెయ్యని కావ్య ఇంస్టాగ్రామ్ లో మాత్రం తన ఫోటోలతో తెగ అలరిస్తోంది. ముఖ్యంగా ఈ మధ్య బ్లాక్ డ్రెస్సులు కావ్య షేర్ చేసిన ఫోటోలు అందరి దగ్గర నుంచి తన అందం అదరహో అనే కామెంట్లు వచ్చే లాగా చేస్తున్నాయి.