Rammandir Pics: అయోధ్య రామమందిరం లోపలి ఫోటోలు చూశారా, కళ్లు చెదిరే ఆర్కిటెక్చర్

Rammandir Pics: అయోధ్యలో రామ మందిర నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. 2024 జనవరిలో ప్రాణ ప్రతిష్ఠకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో శ్రీరామ జన్మభూమి తీర్ఘ క్షేత్ర ట్రస్ట్ రామ మందిరం లోపలి ఫోటోల్ని షేర్ చేసింది. ఆ ఫోటోలు మీ కోసం..

1 /7

రామ్‌లల్లా విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ నాడు 4 వేల మంది సాధువులు, విభిన్న సమాజాలకు చెందిన 2000 మంది పాల్గొంటారు.

2 /7

అయోధ్యలో మందిర నిర్మాణం రెండవ దశ 2024 డిసెంబర్ నాటికి పూర్తవుతుంది. మూడవ ధస 2025 డిసెంబర్ నాటికి పూర్తి కానుంది.య ఈ దశలో అంటే మూడవ దశ పూర్తయ్యే సరికి మంందిరం పరిసరాలు పూర్తిగా నిర్మాణమౌతాయి. 

3 /7

అయోధ్యలో రామ మందిర నిర్మాణం 2020 ఆగస్టు 5న ప్రారంభమైంది. మూడు దశల్లో ఈ నిర్మాణం పూర్తి కానుంది. మొదటి దశ 2023 డిసెంబర్ నాటికి పూర్తవుతుంది. మొదటి దసలో గ్రౌండ్ ఫ్లోర్ నిర్మాణం జరుగుతుంది. శ్రీరాముడి విగ్రహ ప్రతిష్ఠ ఉంటుంది.

4 /7

ఆలయం లోపల కళాత్మక ఆర్ట్ ఉంది. అయోధ్యలో జనవరి 22, 2024న భారీగా భక్తజనం తరలిరావచ్చని అంచనా. ఈ క్రమంలో భద్రత ఇతర ఏర్పాట్లపై ట్రస్ట్ ఆందోళన చెందుతోంది. 

5 /7

శ్రీరామ జన్మభూమి తీర్ధక్షేత్ర ట్రస్ట్ ప్రకారం రామ మందిర నిర్మాణం పూర్తయ్యాక ప్రతిరోజూ లక్ష నుంచి లక్షన్నర మంది భక్తులు సందర్శిస్తారని అంచనా. గర్భగుడిలో శ్రీరాముడి దర్శనానికి ప్రతి ఒక్కరికి 20-30 సెకన్లు మాత్రమే సమయం కేటాయించనున్నారు.

6 /7

అయోధ్యలో రామ్‌లల్లా ప్రాణ ప్రతిష్ఠ ఉత్సవం పదిరోజులు నడుస్తుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వచ్చే ఏడాది జనవరి 22న ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొంటారు. 

7 /7

అయోధ్యలో నిర్మాణంలో ఉన్న రామ మందిరం లోపలి ఫోటోల్ని శ్రీ రామ జన్మభూమి తీర్ఘక్షేత్ర ట్రస్ట్ విడుదల చేసింది. ఇందులోరామాలయం లోపలి ఆర్కిటెక్ట్ అందర్నీ ఆకర్షిస్తోంది. జనవరి 22, 2024న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రామ్‌లల్లా విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నారు.