Asia Cup 2023: ఆసియా కప్‌లో అత్యధిక పరుగులు చేసిన టాప్-5 బ్యాట్స్‌మెన్ వీళ్లే..

Top 5 Batsmen With Most Runs In An Asia Cup Edition: ఆసియా కప్ 2023కు ముహూర్తం దగ్గరపడుతోంది. ఈ నెల 30వ తేదీ నుంచి పాకిస్థాన్-నేపాల్ మధ్య పోరుతో టోర్నీ ఆరంభంకానుంది. సెప్టెంబర్ 2న పాకిస్థాన్‌తో టీమిండియా తొలి మ్యాచ్‌లో తలపడనుంది. ఆసియా కప్‌లో ఒక ఎడిషన్‌లో అత్యధిక పరుగులు చేసిన టాప్-5 ప్లేయర్లపై ఓ లుక్కేయండి.
 

1 /5

శ్రీలంక బ్యాటింగ్ దిగ్గజం జయసూర్య 2008 ఆసియా కప్‌లో 75.60 సగటు,స్ట్రైక్ రేట్ 126తో 378 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, ఒక అర్ధసెంచరీలు ఉన్నాయి.  

2 /5

భారత మాజీ మిడిల్ ఆర్డర్ బ్యాటర్ రైనా 2008 ఆసియా కప్‌లో 372 రన్స్ చేశాడు. ఇదులో 2 సెంచరీలు, 2 అర్ధసెంచరీలు ఉన్నాయి.  

3 /5

టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ 2012 ఆసియా కప్‌లో 3 మ్యాచ్‌లలో 357 పరుగులు చేశాడు. సగటు 119 కాగా స్ట్రైక్ రేట్ 102గా ఉంది. 2 సెంచరీలు, ఒక హాఫ్ సెంచరీ బాదాడు.   

4 /5

2008లో ఆసియా కప్‌లో 5 మ్యాచ్‌ల్లో నజఫ్‌గఢ్ నవాబ్, మాజీ డాషింగ్ ఓపెనర్ సెహ్వాగ్ 69.60 సగటు, 143.80 స్ట్రైక్ రేట్‌తో 348 పరుగులు చేశాడు.  

5 /5

శ్రీలంక మాజీ కెప్టెన్ కుమార సంగక్కర 2008 ఆసియా కప్‌లో 6 మ్యాచ్‌ల్లో 345 పరుగులు చేశాడు. సగటు 57.50 ఉండగా.. స్ట్రైక్ రేట్ 99.13గా ఉంది.