Florida Python Challenge: పాములు పట్టే పోటీ.. పట్టుకుంటే లక్షల్లో ప్రైజ్‌ మనీ

Here Full Details Of Florida Python Challenge 2024: ఎక్కడా వినని పోటీ జరగబోతున్నది. ఒక్క పని చేస్తే చాలు లక్షల్లో నగదు బహుమతి పొందుతారు. దీనికి మీరు చేయాల్సినదంతా పాములను పడితే చాలు. ఇలాంటి ఆసక్తికర పోటీకి సంబంధించిన విషయాలు తెలుసుకోండి.

1 /9

Florida Python Challenge: పాములు పట్టే ఆసక్తి ఉందా? అడవిలో కొండచిలువను వేటాడి చంపితే భారీగా నగదు బహుమతి పొందవచ్చు.

2 /9

Florida Python Challenge: ప్రపంచంలో పాముల పోటీ జరిగేది ఎక్కడంటే అమెరికాలోని ఫ్లోరిడా. ఇక్కడ నిర్వహించే పాముల పోటీకి ఎంతో ప్రత్యేకత ఉంది.

3 /9

Florida Python Challenge: పాములు పట్టే పోటీ పేరు ఫ్లోరిడా పైతాన్‌ ఛాలెంజ్‌. ఈ పోటీకి పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొంటారు.

4 /9

Florida Python Challenge: ఫ్లోరిడా ఫిష్‌ అండ్‌ వైల్డ్‌లైఫ్‌ కన్జర్వేషన్‌ కమిషన్‌ (ఎఫ్‌డబ్ల్యూసీ) ప్రతి సంవత్సరం ఆగస్టులో పైతాన్‌ ఛాలెంజ్‌ పోటీ నిర్వహిస్తుంటుంది.

5 /9

Florida Python Challenge: ఈ పోటీ పది రోజుల పాటు ఉంటుంది. ఇప్పటికే ఆగస్టు 9వ తేదీన ప్రారంభమైన ఈ పోటీలు ఈనెల 18వ తేదీతో ముగుస్తాయి.

6 /9

Florida Python Challenge: పోటీలో పాల్గొనేవారు ఎవర్‌గ్లేడ్స్‌ ప్రాంతంలోని బర్మీస్‌ పైతాన్‌లను పట్టుకోవాల్సి ఉంది.

7 /9

Florida Python Challenge: బర్మీస్‌ పైతాన్‌ అనే రకం కొండచిలువ అక్కడ ప్రమాదకరంగా మారాయి. ఈ జాతి ఆడ కొండచిలువ ఒకేసారి వంద గుడ్లు పెడుతుంది. దీంతో వాటి సంతానం పెరిగి అక్కడి జీవ వైవిధ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి.

8 /9

Florida Python Challenge: పర్యావరణ సంక్షోభం నుంచి కాపాడేందుకు ఈ పోటీలు నిర్వహిస్తున్నారు. ఆ ప్రాంతంలో విస్తరిస్తున్న కొండచిలువలను పట్టుకుని వాటిని హింసించకుండా చంపివేయాలి. వాటిని చంపితే రూ.లక్ష దాకా నగదు బహుమతి లభిస్తుంది.

9 /9

Florida Python Challenge: గతేడాది జరిగిన పోటీల్లో 209 కొండచిలువలను పట్టుకుని చంపివేశారు. వాటిని వేటాడి చంపిన వారికి నగదు బహుమతులు ఇచ్చారు.