YS Jagan Mohan reddy: ఏపీ సీఎం వైఎస్ జగన్ ఎమోషనల్ అయ్యారు. తన చెల్లెలు వైఎస్ షర్మిలను మిస్ అవుతున్నానంటూ ఎమోషనల్ అయ్యారు.ఈ ఘటన ఎన్నికల వేళ ఏపీలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
ఆంధ్ర ప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన చెల్లలు వైఎస్ షర్మిలను మిస్ అవుతున్నానంటూ కూడా ఎమోషనల్ అయ్యారు. కుటుంబం అన్నాక బేధాభిప్రాయాలు ఉండటం సహాజమే అని అన్నారు. మాట్లాడుకోవడంలేనంత మాత్రన ప్రేమలు ఉండకుండా పోవన్నారు. కానీ నా చెల్లెళ్లు పగవాళ్ల పక్కకు వెళ్లి చేరడం తనకు బాధిస్తుందన్నారు.
ముఖ్యంగా తన తండ్రిని చంపిన వాళ్ల పక్కకు, తనతండ్రిపై కేసు పెట్టి, తనకుటుంబాన్ని వేధించిన వాళ్ల పార్టీలోకి షర్మిలమ్మ వెళ్లి చేరడం తనమనస్సును కలిచివేస్తుందన్నారు. ఇటీవల వైఎస్ జగన్ ఒక మీడియా ఇంటర్య్వూలోపాల్గొన్నారు. అక్కడ యాంకర్ మీ చెల్లెలుని మిస్ అవుతున్నారా.. అని ప్రశ్నించారు.
దీనికి సమాధానంగా ప్రతి ఇంట్లోను అన్న దమ్ములున్నాక, అక్కాచెల్లెళ్లన్నాక గొడవలు ఉంటాయి. కానీ తమ కుటుంబాన్ని వేధించి, తండ్రి మరణానికి కారణమైన వాళ్లపక్కన నా చెల్లెలు వెళ్లి ఉండటంతనకు బాధిస్తుందన్నారు. ముఖ్యంగా తన బాబాయ్ ను కూడా హత్య చేసి దాన్ని కూడా రాజకీయంగా వాడుకోవడానికి ప్రయత్నిస్తున్నారన్నారు.
చంద్రబాబు, కాంగ్రెస్ నేతలు చెప్పిందే తన చెల్లెలు చేస్తుందని, వాళ్లు రాసిచ్చింది తన చెల్లెలు చదువుతోందని కూడా జగన్ ఎమోషనల్ అయ్యారు. సీఎం జగన్ వ్యాఖ్యలు ఎన్నికల వేళ ఏపీలో హాట్ టాపిక్ గా మారాయి. దీనిపై కొందరు వైఎస్ జగన్ కు మద్దతుగా నిలుస్తున్నారు.
ఇక షర్మిల తన కుమారుడి ఎంగెజ్ మెంట్ కు వైఎస్ జగన్ తో ఆహ్వానించి కనీసం సరిగ్గా పలకరించలేదని కూడా ఆయన ఆవేదన చెందారంట. ఇక పెళ్లికైతే కనీసం పిలవలేదు. కానీ అదే చంద్రబాబు ఇంటికి, ఇతర కాంగ్రెస్ వాళ్ల ఇంటికి వెళ్లి మరీ ఇన్ వైట్ చేసిన విషయం తెలిసిందే.