Reshmi Marriage: భర్త కోసమే మెహందీ.. యాంకర్ రష్మీ పోస్ట్ వైరల్..!

Anchor Reshmi: బుల్లితెర యాంకర్ గా గుర్తింపు తెచ్చుకున్న రష్మీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హీరోయిన్ గా నటించిన సినిమాలు విజయం కాకపోవడంతో బుల్లితెరపై వచ్చి ఇక్కడే సెటిల్ అయింది. ఇక ఇప్పుడు ఈమె పెళ్ళికి సంబంధించిన విషయాలు వైరల్ అవుతున్నాయి.

1 /5

గత కొంతకాలంగా పలువురు బుల్లితెర సెలబ్రిటీస్ తోపాటూ సినీ సెలబ్రిటీస్ సైతం బ్యాచిలర్ లైఫ్ ను వీడి వైవాహ బంధంలోకి అడుగుపెడుతున్నారు. అలా గత కొన్ని నెలల నుంచి చాలామంది సెలబ్రిటీలు బ్యాచిలర్ లైఫ్ ను వీడారు. అయితే తెలుగు బుల్లితెరపై యాంకర్ గా పేరు పొందిన రష్మీ గత కొన్ని నెలలుగా పెళ్లి చేసుకోబోతోంది అని రూమర్స్ అయితే వినిపిస్తూ ఉన్నాయి.

2 /5

ముఖ్యంగా సుదీర్ తో ప్రేమాయణం కొనసాగిస్తోందని,  త్వరలోనే పెళ్లి చేసుకోబోతోందని గతంలో రూమర్స్ వినిపించినా.. కానీ ఈ విషయం పైన అటు రష్మీ , ఇటు సుధీర్ ఇద్దరూ  కూడా క్లారిటీ ఇస్తూ తాము ఇద్దరం కేవలం స్నేహితులమే అంటూ తెలిపారు. 

3 /5

దీంతో ఆ తర్వాత బుల్లితెరకు దూరమైన సుధీర్ సినిమాలలో హీరోగా నటించారు. ప్రస్తుతం హీరోగా కూడా అవకాశాలు రాలేదనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు.. తాజాగా రష్మీ వివాహానికి సంబంధించి పనులు జరుగుతున్నాయనే వార్తలు వినిపిస్తున్నాయి.  అందుకు తగ్గట్టుగానే రష్మి తన ఇంస్టాగ్రామ్ లో కొన్ని మెహందీ ఫోటోలను షేర్ చేయగా అందరూ ఆశ్చర్యపోయారు.. 

4 /5

రష్మీ గుట్టు చప్పుడు కాకుండా వివాహం చేసుకుంటుందా అంటూ పలువురు అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.మరి కొంతమంది మాత్రం రష్మి కాబోయే భర్త కోసమే ఈ మెహందీ ఫోటో లా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.. అయితే ఈ ఫోటోలు చూస్తూ ఉంటే మాత్రం ఏదో సెట్ లో మెహందీ పెట్టించుకున్నట్టుగా కనిపిస్తోంది. 

5 /5

గతంలో రష్మి హీరోయిన్ గా నటించినా కూడా ఈమెకు  సరైన సక్సెస్ రాలేకపోవడంతో ఇండస్ట్రీకి దూరమైన ఈమె బుల్లితెర పైన మాత్రం యాంకర్ గా హవా కొనసాగించాలని చూస్తోంది. ప్రస్తుతం జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి షో లకు జడ్జిగా వ్యవహరిస్తున్నది. మొత్తానికి మెహందీ ఫోటోలతో రష్మీ మాత్రం అందరిని ఆశ్చర్యానికి గురి చేసిందని చెప్పవచ్చు.