1985 మే 15న హైదరాబాద్‌లో అనసూయ భరద్వాజ్ జన్మించారు. 2008లో భద్రుక కళాశాల నుంచి అనసూయ ఎంబీఏ పట్టా పొందారు.
ఎంబీఏ పూర్తయిన అనంతరం ఫిక్స్ లాయిడ్ కంపెనీలో హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్‌గా అనసూయ భరద్వాజ్ పని చేశారు. ఆపై సాక్షి టీవీలో టెలివిజన్ వ్యాఖ్యాతగా చేశారు.
ఈటీవీ కామెడీ షో 'జబర్దస్త్'తో బుల్లితెరకు పరిచమైన అనసూయ భరద్వాజ్ అనతి కాలంలోనే పాపులర్ అయ్యారు. అను తన అందం, యాంకరింగ్‌తో అందరిని ఆకట్టుకున్నారు.
అనసూయ భరద్వాజ్ బుల్లితెరపై మాత్రమే కాకుండా వెండితెరపై కూడా సత్తాచాటుతున్నారు. క్షణం, రంగస్థలం సినిమాలో అను నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఇక పుష్ప చిత్రంతో మరింత స్టార్ డమ్ తెచ్చుకున్నారు.
అనసూయ భరద్వాజ్ ఎప్పటికప్పుడూ ట్రెండ్స్‌ను ఫాలో అవుతూ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంటారు. నెట్టింట ఆమె పెట్టే ఒక్కో పోస్టుకు లైక్స్, కామెంట్ల వర్షం కురుస్తుంటుంది.
అనసూయ భరద్వాజ్ తాజాగా శారీలో అందంగా ముస్తాబయ్యారు. రంగమార్తాండ సినిమా ప్రమోషన్ కోసం ఆమె స్లీవ్ లెస్ బ్లౌజ్, శారీలో వచ్చారు. అను జబర్దస్త్ అందాలకు కుర్రకారు మతులు పోతున్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.