Ananya Panday : డ్రగ్స్‌ కేసులో రెండో రోజూ ఎన్సీబీ విచారణకు హాజరైన అనన్య పాండే

Ananya Panday appears at NCB office: బాలీవుడ్‌ ఇండస్ట్రీని డ్రగ్స్‌ కేసు కుదిపేస్తుంది. తాజాగా ఈ కేసుతో సంబంధం ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న హీరోయిన్‌ అనన్య పాండే ఎన్సీబీ ఎదుట హాజరైంది. శుక్రవారం కూడా ఆమె ఎన్సీబీ కార్యాలయానికి వచ్చింది. అనన్య పాండేను ఎన్సీబీ అధికారులు విచారించారు. 

  • Oct 22, 2021, 19:56 PM IST

Ananya Panday appears at NCB office for second day in drugs-related WhatsApp chats with Aryan Khan: బాలీవుడ్‌ ఇండస్ట్రీని కుదిపేస్తున్న క్రూయిజ్‌ నౌకపై డ్రగ్స్‌ కేసులో హీరోయిన్‌ అనన్య పాండే నిన్న తన తండ్రి, నటుడు చంకీ పాండేతో కలిసి ఎన్సీబీ కార్యాలయానికి వచ్చింది. అనన్య ఇంట్లో సోదాలు నిర్వహించిన ఎన్సీబీ అధికారులు ఆమె ఫోన్‌, ల్యాప్‌టాప్‌ను సీజ్‌ చేశారు. నేడు కూడా ఆమె ఎన్సీబీ అధికారుల ఎదుట హాజరయ్యారు. 

1 /5

డ్రగ్స్‌ కేసులో ఇప్పటికే అరెస్టయిన ప్రముఖ బాలీవుడ్‌ స్టార్‌ షారుక్‌ ఖాన్‌ కుమారుడు ఆర్యన్‌ ఖాన్‌ జరిపిన వాట్సాప్‌ చర్చల్లో అనన్య పేరు రావడంతో నిన్న అధికారులు ఆమె నివాసానికి వెళ్లి సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే. దీంతో ఆమె ఈ రోజు కూడా ఎన్‌సీబీ అధికారుల ఎదుట హాజరయ్యారు. 

2 /5

చాలా సేపు అనన్యను ప్రశ్నించిన అధికారులు.. ఆర్యన్‌తో వాట్సాప్‌ చాట్‌ గురించి మరిన్ని వివరాలపై ఆరా తీశారు. వీరిద్దరి మధ్య గంజాయి కోసం వాట్సాప్‌ చర్చ జరిగిందని ఎన్‌సీబీ అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది. 

3 /5

ఈ నెల 2న జరిగిన క్రూయిజ్‌ రేవ్‌ పార్టీలో డ్రగ్స్‌ కావాలని ఆర్యన్‌.. అనన్యకు వాట్సప్‌ చాట్‌ చేసినట్లు సమాచారం. అన్యన విచారణ సమయంలో ఆర్యన్‌ ఖాన్‌తో డ్రగ్స్‌ చాట్‌ గురించి అధికారులు ఆమెను ప్రశ్నించగా.. తాను జోక్‌ చేశానని అనన్య చెప్పినట్లు సమాచారం. 

4 /5

గంజాయి కోసం ఆర్యన్‌ అడగ్గా.. ఏర్పాటు చేస్తానని అనన్య చెప్పినట్లు ఆ చాట్‌లో ఉందని సమాచారం. ఈ చాట్‌ను చూపించి అధికారులు ప్రశ్నించగా.. తాను కేవలం జోక్‌ చేశానని అనన్య చెప్పినట్లు తెలుస్తోంది.

5 /5

తాను ఎప్పుడూ డ్రగ్స్‌ తీసుకోలేదని, ఎవరికీ సరఫరా చేయలేదని ఆమె చెప్పినట్లు సమాచారం. అయితే ఆర్యన్‌ కోసం అనన్య డ్రగ్స్‌ పంపించినట్లు ఎలాంటి సాక్ష్యాలు లభించలేదని తెలుస్తోంది.