Pakistan top cricketers and their wives photo gallery : ఇండియా, పాకిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ అంటే కేవలం ఈ రెండు దేశాల క్రికెట్ ప్రియులకే కాదు.. భారత్, పాకిస్థాన్ గురించి తెలిసిన యావత్ ప్రపంచ క్రికెట్ ప్రియులకు ఓ ఇంట్రెస్టింగ్ మ్యాచ్ అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అలాంటి మ్యాచ్‌కి దుబాయ్ వేదిక కాబోతోంది. అక్టోబర్ 24, ఆదివారం నాడు టీ 20 వరల్డ్ కప్‌లో భాగంగా భారత్, పాకిస్థాన్ జట్లు ( T20 world cup 2021 Ind vs Pak match) దుబాయ్ స్టేడియంలో ప్రత్యక్ష పోరుకు సిద్ధం అవుతున్నాయి.
Pakistan top cricketers and their wives photo gallery: ఇంత ఇంట్రెస్టింగ్ మ్యాచ్ జరిగే సమయంలో భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా (Sania Mirza about Ind vs Pak match) మాత్రం తాను సోషల్ మీడియాకు దూరంగా ఉంటానని ప్రకటించింది. అందుకు కారణం ఆమె పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్‌ని పెళ్లి చేసుకోవడమే. షోయబ్ మాలిక్ భార్యగా తనపై వచ్చే ట్రోల్స్ చూడలేను అనేది సానియా ఉద్దేశం అయ్యుండొచ్చు. ఈ నేపథ్యంలో పాకిస్థాన్‌కి చెందిన మిగతా టాప్ క్రికెటర్స్, వారి భార్యల గురించి సోషల్ మీడియాలో, గూగుల్లో సెర్చ్ నడుస్తోంది. అలా అన్వేషించే నెటిజెన్స్‌కి సమాధానమే ఇదిగో ఈ ఫోటో గ్యాలరీ.
పాకిస్థాన్ ఆల్ రౌండర్ మొహమ్మద్ హమీజ్ 2007లో నజియాను పెళ్లి చేసుకున్నాడు. (Source: Twitter)
పాకిస్థాన్ ఆల్ రౌండర్ ఇమద్ వసీం 2019లో సానియా అష్ఫఖ్‌ని పెళ్లి చేసుకున్నాడు. లండన్‌లో పుట్టి పెరిగిన పాకిస్థానీ అమ్మాయి అష్ఫఖ్ ఎకనమిక్ రిసెర్చర్ కావడంతో పాటు మేనేజ్‌మెంట్ ఎక్స్‌పర్ట్ కూడా. (Source: Twitter)
పాకిస్థాన్ ఆల్ రౌండర్ షోయబ్ మాలిక్, భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా దంపతుల గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. వీళ్లిద్దరి ప్రేమ పెళ్లికి గుర్తుగా ఓ బాబు కూడా పుట్టాడు. ఆ బుడ్డోడి పేరు ఇజాన్. (Source: Twitter)
పాకిస్థాన్ పేసర్ హసన్ అలీ, సామియా అర్జూ ఇద్దరూ దుబాయ్‌లో పెళ్లి చేసుకున్నారు. షోయబ్ మాలిక్, సానియా మీర్జా జంట తరహాలోనే వీళ్లిద్దరిలో ఒకరిది పాకిస్థాన్ అయితే, మరొకరిది భారత్. అవును, సామియా స్వస్థలం హర్యానాలోని పల్వల్. (Source: Twitter)
పాకిస్థాన్ మాజీ కెప్టేన్ సర్ఫరాజ్ అహ్మద్ 2015లో సయ్యెద ఖుష్బఖ్త్ని పెళ్లి చేసుకున్నాడు. ఈ ఇద్దరి వివాహానికి గుర్తుగా ఇద్దరు సంతానం కూడా ఉన్నారు. (Twitter photo) Also read : T20 World Cup 2021: IND Vs PAK మ్యాచ్‌ల్లో అతి పెద్ద కాంట్రావర్శీలు, ఎప్పటికీ గుర్తుండే హైలైట్స్ Also read : T20 WC 2021: ఛాంపియన్‌గా నిలిచేందుకు భారత్‌కే అవకాశాలు ఎక్కువ: ఇంజామామ్ ఉల్ హక్ Also read: T20 WC 2021: మెంటార్‌గా ధోని పని మెుదలెట్టేశాడు...వీడియో వైరల్ Also read : India Vs Pakistan Match History: గెట్ రెడీ ఫర్ హై ఓట్లేజ్ మ్యాచ్.. బల్బులు పగలాల్సిందే!