Home Remedies: పొట్టనొప్పి, మలబద్ధకం, కడుపు ఉబ్బరం సమస్యలను చెక్ పెట్టే అద్భుతమైన ఇంటి చిట్కాలు..

Relief Stomach Aches, Constipation: తీవ్ర పొట్ట సమస్యలతో బాధపడేవారకు తప్పకుండా తీసుకునే ఆహారాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. దీంతో పాటు ఆరోగ్య నిపుణులు సూచించిన కొన్ని హోం రెమెడీస్‌ను ఫాలో అవ్వాల్సి ఉంటుంది.

Relief Stomach Aches, Constipation, Flatulence: చలికాలం సీజన్ మారే సమయంలో చాలామంది అనేక రకాల అనారోగ్య సమస్యల బారిన పడుతూ ఉంటారు. ముఖ్యంగా చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు తీవ్ర పొట్ట సమస్యలతో ఇబ్బంది పడతారు. ఈ సమయంలో చాలామంది పొట్టనొప్పి, మలబద్ధకం, కడుపు ఉబ్బరం, లూజ్ మోషన్స్ వంటి పొట్ట సమస్యల బారిన పడతారు. అయితే తరచుగా మీరు కూడా ఇలాంటి సమస్యలను ఎదుర్కొంటున్నారా? ఈ పొట్ట సమస్యల నుంచి కొన్ని హోమ్ రెమెడీస్ ను వినియోగించి సులభంగా ఉపశమనం పొందవచ్చు.
 

1 /5

తరచుగా పొట్ట సమస్యలతో బాధపడేవారు ప్రతిరోజు గోరువెచ్చని నీటిలో ఒక టీ స్పూన్ ఉసిరి పొడిని కలుపుకొని తాగడం వల్ల సులభంగా మంచి ఫలితాలు పొందుతారు. ముఖ్యంగా పొట్ట నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.

2 /5

ప్రతిరోజు ఫైబర్ కలిగిన ఆహారాలను తీసుకోవడం వల్ల సులభంగా మలబద్ధకం జీర్ణక్రియ సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. అంతేకాకుండా ఈ ఫైబర్ శరీర బరువును అదుపులో ఉంచేందుకు కూడా సహాయపడుతుంది.

3 /5

పొట్ట సమస్యలతో బాధపడేవారు సోంపు నీరును కూడా తీసుకోవచ్చని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే గుణాలు అన్ని రకాల పొట్ట సమస్యలకు ప్రభావంతంగా సహాయపడతాయి. అంతేకాకుండా ఇతర ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా కూడా జీర్ణాశయాన్ని రక్షిస్తాయి.  

4 /5

మలబద్ధకం, ఇతర జీర్ణాశయ సమస్యలతో బాధపడుతున్న వారు ప్రతి రోజు నీటిని ఎక్కువగా తాగాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇలా ఎక్కువ నీటిని తీసుకోవడం వల్ల శరీరం హైడ్రేట్‌గా మారడమే కాకుండా జీర్ణ క్రియ సమస్యలు కూడా దూరమవుతాయి.  

5 /5

దాల్చిన చెక్క నీటిలో కూడా శరీరానికి కావాల్సిన అనేక రకాల ఔషధ గుణాలు లభిస్తాయి. కాబట్టి ఈ నీటిని ప్రతి రోజు తాగడం వల్ల అనేక రకాల పొట్ట సమస్యల నుంచి కూడా ఉపశమనం పొందవచ్చు. ముఖ్యంగా తరచుగా మలబద్ధకం సమస్యలతో బాధపడేవారు తప్పకుండా దాల్చిన చెక్క నీటిని తీసుకోండి.