Ambedkar Jayanti 2024: డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి స్పెషల్ కోట్స్, HD ఫొటోస్..

Ambedkar Jayanti 2024 Quotes And Photos In Telugu: ప్రతి సంవత్సరం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతిని ఏప్రిల్ 14వ తేదీన ఎంతో ఘనంగా జరుపుకుంటారు. ఆయన చేసిన త్యాగానికి గాను గుర్తించుకుంటూ దేశవ్యాప్తంగా వాడవాడల్లో ఆయన జయంతి ఉత్సవాలు జరుపుతారు. ఆయన జన్మించిన రోజే ఈ ఉత్సవాలు జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. 

 

Ambedkar Jayanti 2024 Quotes And Photos In Telugu: భరతమాత గడ్డపై డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జన్మించడం ఎంతో అదృష్టంగా భావించవచ్చు. ఎందుకంటే ఆయనలో ఉన్నవి గొప్పశక్తులు, అంతకంటే చెప్పాలంటే ఆయనే ఒక శక్తి. ఎన్నో ఉన్నతమైన భావాలు కలిగిన సమూహ శక్తి. ఆయన జీవితంలోని ప్రతి ఒక్క అడుగు ఒక పూల బాట. ఆయన జీవితంలోని ప్రతి స్టోరీ కన్నీటి సంద్రం. ఆయన నిత్య పోరాట యోధులు. ఆయనను అంటరాని వాడిగా ముద్ర వేసిన సమాజానికే బుద్ధి చెప్పినవారు. చివరికి ఆయన ఎంతో శ్రద్ధతో చెక్కిన శిల్పంలా తనను తాను మలుచుకుంటూ చివరికి రాజ్యాంగ నిర్మాతగా మారారు. ఆయన దేశానికే కాదు దిశా నిర్దేశం.. ఆయన భారతదేశం కోసం జీవితాన్ని సైతం త్యాగం చేశారు. అలాంటి వ్యక్తి గురించి ఎంత చెప్పినా తక్కువే. నిరుపేద అంటరాని వారికోసం ఎంతో కృషి చేసి జనం గుండెల్లో నిలిచారు. అందుకే ఆయనను ఇప్పటికీ ప్రజలు తమ గుండెల్లో పెట్టుకొని జయంతి వేడుకలను ఎంతో ఘనంగా చేస్తారు.  

1 /8

ప్రజలంతా మొదట విద్యావంతులు కావాలి.. అప్పుడే ఒక ఉన్నతమైన సమాజం ఏర్పడుతుంది. -డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్   

2 /8

స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం రాజ్యాంగంలో కేవలం పదాలు కాదు. అవి రాజ్యాంగం ప్రాణం.-అంబేద్కర్  

3 /8

మనం మన దేశంగా పిలుచుకోవడం వల్ల మాత్రమే మన దేశం కాదు.. ఎప్పుడైతే దేశ అభివృద్ధి కోసం కృషి చేస్తావో అప్పుడే మన దేశం అవుతుంది. -డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్   

4 /8

ప్రజాస్వామ్యం స్వయంగా నడిచే యంత్రం కాదు. దానికి నిరంతర పునరుద్ధరణ, మరమ్మతులు అవసరం. -అంబేద్కర్  

5 /8

మనం సామాజిక వ్యవస్థను క్రింది నుండి పైకి మార్చుకుంటే, ఈ దేశంలో నిజమైన విప్లవాన్ని తెచ్చగలము. -డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్   

6 /8

నేను ఒక సమాజం పురోగతిని.. మహిళలు సాధించిన పురోగతి స్థాయిగా కొలుస్తాను. -అంబేద్కర్   

7 /8

ప్రపంచాన్ని మార్చడానికి మీరు ఉపయోగించగల అత్యంత శక్తివంతమైన ఆయుధం విద్య. -డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్   

8 /8

 పురాతన భారతదేశం ఆధ్యాత్మిక, నైతిక ఆలోచనలకు ఒక గొప్ప విశ్వవిద్యాలయం. -అంబేద్కర్