Amazon Great Freedom Festival: అమెజాన్‌లో ఆఫర్ల పండగ.. డెడ్ చీప్‌ ధరలో 5 బెస్ట్ స్మార్ట్ ఫోన్స్.. ఆఫర్ 4 రోజులే..

ప్రముఖ ఈకామర్స్ దిగ్గజం అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్‌ను ప్రకటించింది. ఆగస్టు 6 నుంచి ఆగస్టు 10 వరకు ఈ సేల్ అందుబాటులో ఉండనుంది. గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్‌లో భాగంగా పలు బ్రాండ్స్‌కి చెందిన స్మార్ట్ ఫోన్లను అమెజాన్ చౌక ధరకే అందిస్తోంది. భారీ డిస్కౌంట్‌తో పాటు ఎక్స్‌చేంజ్ ఆఫర్ కూడా అందిస్తోంది. తద్వారా అతి చౌక ధరకే బెస్ట్ బ్రాండ్ స్మార్ట్ ఫోన్‌ను సొంతం చేసుకోవచ్చు. అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్‌లో ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఐదు బెస్ట్ స్మార్ట్ ఫోన్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

1 /5

OnePlus Nord CE 2 Lite 5G: 6GB ర్యామ్, 128GB స్టోరేజీతో కూడిన నార్డ్ సీఈ 2 లైట్ 5జీ ఫోన్ అసలు ధర రూ.19,999. కానీ అమెజాన్ 'గ్రేట్ ఫ్రీడమ్ సేల్' ఆఫర్‌లో భాగంగా ఈ స్మార్ట్ ఫోన్ కేవలం రూ.18,999కే లభిస్తోంది. అంటే డిస్కౌంట్ ద్వారా రూ.1 వెయ్యి వరకు ఆదా అవుతుంది. అంతేకాదు, ఎక్స్‌చేంజ్ ఆఫర్ ద్వారా గరిష్ఠంగా రూ.12,750 వరకు తగ్గింపు లభిస్తోంది. తద్వారా కేవలం రూ.7249కే ఈ స్మార్ట్ ఫోన్‌ని మీ సొంతం చేసుకోవచ్చు.  

2 /5

Redmi Note 11 Pro + 5G: 6జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజీతో కూడిన ఈ స్మార్ట్ ఫోన్ అసలు ధర రూ.24,999. కానీ అమెజాన్‌లో డిస్కౌంట్‌పై కేవలం రూ.18,999కే ఈ స్మార్ట్ ఫోన్ అందుబాటులో ఉంది. ఇక ఎక్స్‌చేంజ్ ద్వారా ఈ స్మార్ట్ ఫోన్‌పై రూ.18049 వరకుతగ్గింపు లభిస్తోంది. ఈ ఆఫర్ మీకు వర్తించినట్లయితే కేవలం రూ.999కే రెడ్‌మీ నోట్ 11 ప్రో ప్లస్‌ని మీ సొంతం చేసుకోవచ్చు.

3 /5

iQOO Z6 Pro 5G: ఈ స్మార్ట్ ఫోన్ అసలు ధర రూ.27,990. కానీ అమెజాన్‌లో డిస్కౌంట్‌పై రూ.23,999కే అందుబాటులో ఉంది. అంతేకాదు, ఎక్స్‌చేంజ్ ద్వారా గరిష్ఠంగా రూ.20,950 వరకు తగ్గింపు పొందవచ్చు. తద్వారా కేవలం రూ.3049కే ఈ స్మార్ట్ ఫోన్‌ని కొనుగోలు చేయవచ్చు.  

4 /5

Oppo A74 5G: ఈ స్మార్ట్‌ఫోన్ అసలు ధర రూ.20,990. కానీ అమెజాన్ సేల్‌లో 29 శాతం తగ్గింపుతో కేవలం రూ.14,990కే లభిస్తోంది. ఎక్స్‌చేంజ్ ఆఫర్ వినియోగించుకున్నట్లయితే మరింత చౌకగా కేవలం రూ.790కే ఈ స్మార్ట్ ఫోన్‌ని మీ సొంతం చేసుకోవచ్చు. 

5 /5

Samsung Galaxy M33 5G: శాంసంగ్ గెలాక్సీ ఎం33 5జీ అసలు ధర రూ.24,999. కానీ అమెజాన్‌ 'గ్రేట్ ఫ్రీడమ్ సేల్' ఆఫర్‌లో 24 శాతం డిస్కౌంట్‌తో రూ.18,999కే ఈ స్మార్ట్‌ఫోన్‌ అందుబాటులో ఉంది. అంతేకాదు, ఎక్స్‌చేంజ్ ఆఫర్ ద్వారా ఏకంగా రూ.18 వేలు వరకు తగ్గింపు అందుబాటులో ఉంది. ఈ ఆఫర్ ద్వారా డెడ్ చీప్‌గా రూ.999కే ఈ స్మార్ట్ ఫోన్ మీ సొంతమవుతుంది.