Pushpa 2 Rare Record: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా సుకుమార్ డైరెక్షన్ లో తెరకెకెక్కిన చిత్రం ‘పుష్ప 2’. ఈ మూవీ ముఖ్యంగా హిందీ ప్రేక్షకులకు నెత్తిన పెట్టుకున్నారు. అంతేకాదు హిందీ వెర్షన్ లో బాహుబలి 2 తర్వాత పలు రికార్డులను నమోదు చేసింది.
Pushpa 2 Rare Record: పుష్ప 2 విడుదలైనప్పటి నుంచి రికార్డుల పరంపర కొనసాగుతోంది. ఇప్పటికే తొలి రోజు మన దేశంలో అత్యధిక నెట్ వసూళ్లను సాధించిన తొలి చిత్రంగా పుష్ప 2 రికార్డు క్రియేట్ చేసింది. అంతకు ముందు తెలుగు సినిమా ‘బాహుబలి 2’ ఫస్ట్ డే హిందీ అత్యధిక ఫస్ట్ డే రికార్డు క్రియేట్ చేసింది.
రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘బాహుబలి 2’ సినిమా మన దేశంలో హిందీ వెర్షన్ లో తొలి రూ. 400 కోట్ల నెట్ వసూళ్లను సాధించిన చిత్రంగా రికార్డు క్రియేట్ చేసింది.
ఆ తర్వాత బీ టౌన్ లో రూ. 500 కోట్ల నెట్ వసూళ్లను క్రాస్ చేసిన సినిమా రికార్డు క్రియేట్ చేసింది. ఈ రెండు మైలు రాళ్లను అందుకోవడానికి మూడేళ్ల సమయం పట్టింది. ఒకే తెలుగు సినిమా రెండు రికార్డులను బ్రేక్ చేసింది. అంతేకాదు ఒక ప్రాంతీయ భాష చిత్రం హిందీలో ఇండస్ట్రీ హిట్ గా నిలవడం అదే తొలిసారి అని చెప్పాలి.
మరోవైపు పుష్ప 2 సినిమా హిందీలో తొలి రూ. 700 కోట్ల నెట్ వసూళ్లను సాధించిన ఫస్ట్ ప్రాంతీయ చిత్రంగా రికార్డు క్రియేట్ చేసింది. ఆ తర్వాత రూ. 800 కోట్ల క్లబ్బులో ప్రవేశించిన ఫస్ట్ మూవీ కూడా పుష్ప 2 కావడం ఇదే ఫస్ట్ టైమ్.
మొత్తంగా ఈ సినిమా హిందీలో బాహుబలి 2 తర్వాత అనేక రికార్డులను బ్రేక్ చేసిన ప్రాంతీయ తెలుగు చిత్రంగా రికార్డులను పాతర వేస్తోంది. అక్కడ ప్రేక్షకులు పుష్ప 2ను ఆదరిస్తున్నారు. అంతేకాదు మొత్తంగా హిందీ వెర్షన్ ప్రపంచ వ్యాప్తంగా రూ. 1000 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించడం విశేషం.
మొత్తంగా పుష్ప 2తో పాటు తొలి రూ. 650 కోట్లు.. ఫస్ట్ రూ. 700 కోట్లు.. ఆ తర్వాత రూ 750 కోట్లు.. అటు రూ. 800 కోట్ల నెట్ వసూళ్లను సాధించిన చిత్రంగా రికార్డులను క్రియేట్ చేసింది. మొత్తంగా నాలుగు వారాల్లో హైయ్యెస్ట్ కలెక్షన్స్ సాధించిన చిత్రంగా రికార్డులను క్రియేట్ చేసింది. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 850 కోట్ల షేర్ (రూ. 1800 కోట్ల గ్రాస్) వసూళ్లను సాధించినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.