Trisha Krishnan Pics: దివి నుంచి భువికి దిగొచ్చిన అందం.. త్రిష మత్తు చూపులకు మైకం రావడం పక్కా!

Trisha looks very Beautiful in Gold Colour Saree at Thalapathy67 Movie Pooja. త్రిష ప్రస్తుతం కోలీవుడ్‌ స్టార్‌ హీరో విజయ్‌తో కలిసి నటించనున్నారు. ఈ సినిమా పూజా కార్యక్రమంలో ఆమె  గోల్డ్ కలర్ పట్టు శారీలో మెరిశారు. 
 

1 /6

ఇటీవల లేడీ ఓరియెంటెడ్‌ సినిమా ‘రాంగీ’తో అలరించిన త్రిష కృష్ణన్.. ప్రస్తుతం కోలీవుడ్‌ స్టార్‌ హీరో విజయ్‌తో కలిసి నటించనున్నారు. ఈ సినిమా పూజా కార్యక్రమంలో చెన్నై చిన్నది గోల్డ్ కలర్ పట్టు శారీలో మెరిశారు.   

2 /6

తెలుగుతో పాటు తమిళంలోనూ త్రిష స్టార్ హీరోయిన్‌గా సత్తాచాటారు. ఆ తర్వాత లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లోనూ నటించి మెప్పించారు. గతకొంత కాలంగా చెన్నై చిన్నది ఆచితూచి సినిమాలు చేస్తున్నారు.   

3 /6

తెలుగులో చిరంజీవి, వెంకటేష్, బాలకృష్ణ. నాగార్జున, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, ప్రభాస్, ఎన్టీఆర్, రవితేజ లాంటి స్టార్ హీరోలతో  త్రిష నటించారు.   

4 /6

2004లో ప్రభాస్ హీరోగా వచ్చిన 'వర్షం' సినిమాతో త్రిష తెలుగు ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేశారు. నువ్వొస్తానంటే నేనొద్దంటానా, పౌర్ణమి, అతడు, ఆడవారి మాటలకు అర్ధాలు వేరులే సినిమాలతో స్టార్ హీరోయిన్ అయ్యారు.   

5 /6

పలు యాడ్స్ చేసిన త్రిష కృష్ణన్.. దర్శుకుల కళ్లలో పడ్డారు. 2003లో వచ్చిన 'నీ మనసు నాకు తెలుసు' సినిమాతో తెలుగు తెరకు త్రిష పరిచయం అయ్యారు.   

6 /6

1983 మే 4 చెన్నై మహానరంలో త్రిష కృష్ణన్ జన్మించారు. అందాల పోటీలలో మిస్ చెన్నైగా ఎంపికై తర్వాత మిస్ ఇండియా అందాల పోటీలలో పాల్గొన్నారు.