Aishwarya Rai - Abhishek Bachchan divorce : బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మోస్ట్ బ్యూటిఫుల్ జంటగా గుర్తింపు తెచ్చుకున్న అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యారాయ్ జంట గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ఇద్దరి జోడి ప్రేక్షకులలో మంచి ఆదరణ పొందింది. వీరి వివాహం జరిగి దాదాపు దశాబ్ద కాలానికి పైగానే అవుతున్నా ఇప్పటికీ సంతోషంగా ఉంటూ ఎంతో అన్యోన్యంగా జీవిస్తూ అసలు విమర్శలకు తావు ఇవ్వకుండా మంచి పేరు సొంతం చేసుకున్నారు. అయితే ఏమైందో తెలియదు కానీ అలాంటి ఈ జంటపై గత కొద్ది నెలలుగా విడాకుల రూమర్స్ గట్టిగా వినిపిస్తున్నాయి.
ఐశ్వర్యారాయ్ - అభిషేక్ బచ్చన్ విడిపోతున్నారు అంటూ వార్తలు షికార్లు చేస్తున్నాయి. దీనికి తోడు ఇటీవల అనంత్ అంబానీ - రాధిక మర్చంట్ పెళ్లిలో కూడా ఐశ్వర్య తన కూతురు ఆధ్య తో కలిసి హాజరవగా.. అభిషేక్ బచ్చన్ మాత్రం తన తండ్రి అమితాబ్ బచ్చన్ , తల్లి జయా బచ్చన్ తో కలిసి హాజరయ్యారు. దీనికి తోడు అమితాబ్ బచ్చన్ మాజీ ప్రేయసి రేఖతో ఆ పెళ్లి వేడుకల్లో ఐశ్వర్యరాయ్ చనువుగా ఉండడం ఆ కుటుంబ సభ్యులకు నచ్చలేదని వార్తలు వినిపించాయి.
దీనికి తోడు విదేశాల నుండి ఐశ్వర్యరాయ్ తన కూతురు ఆధ్యా తో కలసి ఇండియాకి వచ్చినప్పుడు కూడా వీరిని రిసీవ్ చేసుకోవడానికి ఎయిర్ పోర్ట్ కి అభిషేక్ బచ్చన్ రాకపోవడంతో ఇద్దరి మధ్య విభేదాలు ఉన్నాయనే వార్తలు వినిపించాయి.
ఇదే కాదు గత కొద్ది రోజుల క్రితం ఐశ్వర్యరాయ్, తన చిన్ననాటి స్నేహితుడైన ఒక వ్యక్తిని ప్రేమిస్తోందని , అతనితో కాస్త చనువుగా ఉంటూ వివాహం చేసుకోవాలని అనుకుంటుందని, అందుకే అభిషేక్ కి విడాకులు ఇవ్వబోతోందనే వార్తలు వినిపించాయి. కానీ ఇందులో ఎటువంటి నిజం లేకపోయింది.
అయితే ఇప్పుడు తాజాగా మరొక వార్త తెరపైకి వచ్చింది. ప్రముఖ హీరో అభిషేక్ బచ్చన్.. ఇటీవల తాను నటించిన దస్వి సినిమాలో తనతో పాటు కలిసి నటించిన ప్రముఖ హీరోయిన్ నిమ్రత్ కౌర్ తో ఆయన రిలేషన్ లో ఉన్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈమెపై మోజుతో తన భార్య ఐశ్వర్యరాయ్ కి విడాకులు ఇవ్వబోతున్నట్లు సమాచారం.
అయితే ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ వార్తలు సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతూ ఉండడం గమనార్హం. ఏది ఏమైనా ఐశ్వర్యరాయ్ - అభిషేక్ బచ్చన్ విడాకులు తీసుకోబోతున్నారు అంటూ వస్తున్న వార్తలలో ఎటువంటి అధికారిక ప్రకటన లేకపోయినా ఈ వార్తలు మాత్రం ఇప్పుడు షికార్లు చేస్తున్నాయి.