Genelia: అర్ధరాత్రి విడాకులు.. షాక్ లో జెనీలియా..!

Genelia marriage: ప్రముఖ బ్యూటీ జెనీలియా గురించి పరిచయం ప్రత్యేకంగా అవసరం లేదు.  తన అద్భుతమైన నటనతో మెప్పించిన ఈ ముద్దుగుమ్మ బొమ్మరిల్లు సినిమాతో హాసిని పాత్రతో మరింత పాపులారిటీ దక్కించుకుంది.. అంతకు ముందు వరకు ఎలాంటి గుర్తింపు లేని ఈమె.. బొమ్మరిల్లు సినిమాతో బాగా పాపులారిటీ అందుకుంది. ఇదిలా ఉండగా జెనీలియా బ్రేకప్ అంటూ ఒక వార్త తెరపైకి వచ్చింది అదేంటో ఇప్పుడు చూద్దాం. 
 

1 /5

బొమ్మరిల్లు సినిమాతో భారీ పాపులారిటీ సంపాదించుకొని,  తెలుగు ప్రేక్షకులను అలరించిన జెనీలియా తెలుగు మాత్రమే కాకుండా హిందీ, తమిళ్, మరాఠీ చిత్రాలలో కూడా నటించింది. జెనీలియా 2002 లో రితేష్ దేశ్ ముఖ్ తో ప్రేమలో పడి 2012లో పెళ్లి చేసుకుంది. పెళ్లి తర్వాత కొంతకాలం సినిమాకు గ్యాప్ ఇచ్చిన ఈమె ఇద్దరు మగ పిల్లలకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే.  

2 /5

ఇకపోతే ప్రేమలో ఉన్నప్పుడే ఒక అర్ధరాత్రి రితేష్ పెట్టిన మెసేజ్ కి తాను కంగారు పడ్డారని కృంగిపోయానని జెనీలియా కామెంట్ చేసింది. అర్ధరాత్రి దాటాక అప్పుడే తెల్లవారుతుండగా రెండున్నర గంటలకు రితేష్ పంపిన టెక్స్ట్ మెసేజ్ చదివి ఏం జరిగిందో అర్థం కాక ఎమోషనల్ అయ్యాను అంటూ చెప్పుకొచ్చింది.

3 /5

ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న జెనీలియా మాట్లాడుతూ.. మేము డేటింగ్ లో ఉన్నప్పుడు ఒక సంఘటన జరిగింది. దానిని నేను ఇప్పటికీ మర్చిపోలేక పోతున్నాను.  రితీష్ కి ఆలస్యంగా నిద్రపోవడం అలవాటు. అయితే నేనేమో త్వరగా నిద్రపోతాను. ఒకరోజు ఏమైందో ఏమో తెలియదు కానీ అర్ధరాత్రి ఒంటి గంట తర్వాత నాకు ఒక సందేశం పంపించారు రితేష్. 

4 /5

బ్రేకప్ చెప్పుకుందాం అంటూ మెసేజ్ పంపించాడు.  తెల్లవారుజామున ఆ సందేశం చూసి షాక్ అయ్యాను. చాలా బాధగా అనిపించింది. మరుసటి రోజు రితీష్ మేల్కొనే వరకు నేను ఎదురు చూశాను.. మొదటి రోజు ఉదయం రితీష్ నాకు ఫోన్ చేసి ఏం చేస్తున్నావ్ అని అడిగారు. నాకు కోపం వచ్చింది ఇకపై మనం మాట్లాడుకోకపోవడం మంచిది నువ్వేం అనుకుంటున్నావ్? అన్నాను.. 

5 /5

దీంతో రితీష్ ఏం జరగనట్లు అలా ఎలా మాట్లాడుతున్నావ్ అంటూ కేకలు వేశాడు. ఆ తర్వాత రాత్రి జరిగింది గుర్తుచేసుకొని.. తాను  కేవలం జోకుగా ఆ సందేశం పంపానని , ఆరోజు ఏప్రిల్ ఫస్ట్ కావడంతో అలా చేశానని రితేష్ వివరించాడట. ఆ తర్వాత అంతా సర్దుకుందని చెప్పుకొచ్చింది జెనీలియా.  ఇకపోతే తాను తన కెరియర్ లో తీసుకున్న మంచి నిర్ణయాలలో రితీష్ పెళ్లి చేసుకోవడం ఒకటి అని చెప్పుకొచ్చింది జెనీలియా. మొత్తానికైతే ఈ విషయాలు వైరల్ గా మారుతున్నాయి.