Actress Divya Bharathi Emotional: కన్నడ సినిమాలో హీరోయిన్గా రాణిస్తున్న దివ్య భారతి తాజాగా తనకు కలిగిన అవమానాలను పంచుకున్నారు. కళాశాల రోజుల్లో తనను సూటిపోటీ మాటలతో వేధింపులకు గురి చేశారని.. ఆ తర్వాత ఇప్పుడు నన్ను గౌరవిస్తున్నారని తెలిపారు.
మోడలింగ్ రంగంలో రాణించిన కోయంబత్తూరుకు చెందిన దివ్యభారతి ప్రస్తుతం సినిమాల్లో బిజీబిజీ అయ్యారు.
తొలి సినిమాతోనే తన అందం.. నటనతో ప్రేక్షకుల మనసులను ఆమె గెలుచుకున్నారు.
సినీ పరిశ్రమలోకి రాకముందు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా రాణించారు. తన గ్లామర్‌తో ఫాలోవర్లను అనూహ్యంగా పెంచేసుకున్నారు.
జీవీ ప్రకాష్ దర్శకత్వం వహించిన 'బ్యాచిలర్' సినిమాతో హీరోయిన్గా దివ్య భారతీ అరంగేట్రం చేసింది. మదిల్ మెయిల్ కాదల్ అని రెండో సినిమా చేసింది.
రెండు సినిమాలతోనే కుర్రకారును తన వైపునకు తిప్పుకున్న దివ్య భారతి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో సంచలన విషయాలు తెలిపారు.
తన కళాశాల రోజుల్లో తన శరీరాకృతిపై తోటి విద్యార్థులు ఆట పట్టించారని దివ్య భారతి వాపోయింది. "ఫాండా బాటిల్", "అస్థి పంజరం" వంటి సూటిపోటీ మాటలు అన్నారని దివ్య భారతి వెల్లడించింది.
వాళ్లు చేసిన కామెంట్లు నాపై చాలా ప్రభావం చూపాయి. ఆ మాటలతో తన శరీరంపైనే అసహ్యాం వేసినట్లు తెలిపింది. ఆ మాటలతో తాను ప్రజల ముందు నడవడానికి కూడా భయపడినట్లు చెప్పింది.
అనంతరం మోడలింగ్‌లో రాణించడంపై మాట్లాడుతూ.. '2015లో ఇన్స్టాగ్రామ్ ఖాతా తెరిచాను. అప్పుడు నా మోడలింగ్ ప్రయాణం మొదలైంది. నా మార్పు చూసి అందరూ నన్ను మెచ్చుకోవడం ప్రారంభించారు' అని దివ్య భారతి ఆ ఇంటర్వ్యూలో తెలిపింది.
'శరీర ఆకృతిని కలిగి ఉండటం ముఖ్యం కాదు. అన్ని విమర్శల మధ్య మిమ్మల్ని మీరు ఎలా ప్రేమిస్తున్నారనేది ముఖ్యం. ఈ విషయం చెప్పడానికి నాకు ఆ రోజుల్లో ఎవరైనా ఉండి ఉంటే బాగుండేది' అని దివ్య తన పాత రోజులను గుర్తు చేసుకుంది.
కాగా దివ్య భారతికి సంబంధించిన పాత ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆమె పాత ఫొటో చూసిన అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. దివ్య భారతి తెలుగులో సుడిగాలి సుధీర్ 'గోట్' సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.