Anjali Photos: అంజలి.. ఇంత అందాన్ని ఇన్ని రోజులు ఎక్కడ దాచావ్?

Anjali Photos: 'ఫోటో', 'షాపింగ్ మాల్' సినిమాలతో ఇటు తెలుగుతో పాటు తమిళం ప్రేక్షకులనూ పలకరించిన అంజలి.. ఆ తర్వాత 'జర్నీ', 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇటీవలే 'వకీల్ సాబ్'లో మెరిసిన ఈ తెలుగమ్మాయి.. ఇప్పుడు దర్శకుడు శంకర్, రామ్ చరణ్ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న 'ఆర్సీ 15' (వర్కింగ్ టైటిల్) షూటింగ్ లో బిజీగా ఉంది. రాజమండ్రిలో జరుగుతోన్న ఆ సినిమా షూటింగ్ వెళ్తూ.. అంజలి కొన్ని ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. అవి ఇప్పుడు వైరల్ గా మారాయి. 
 

  • Feb 20, 2022, 17:31 PM IST

  

1 /5

హీరోయిన్ అంజలి అసలు పేరు బాల త్రిపుర సుందరి. 1986 జూన్ 16న తూర్పు గోదావరి జిల్లా రాజోలులో జన్మించింది.   

2 /5

'ఫొటో' అనే తెలుగు చిత్రంతో వెండితెరకు పరిచమైన అంజలి.. ఆ తర్వాత 'షాపింగ్ మాల్' సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత తమిళం, కన్నడ, మలయాళ సినిమాల్లో బిజీగా మారింది.   

3 /5

'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' సినిమాతో టాలీవుడ్ లోకి గ్రాండ్ గా రీఎంట్రీ ఇచ్చింది అంజలి.   

4 /5

'బలుపు', 'మసాలా', 'గీతాంజలి', 'శంకారాభరణం', 'డిక్టేటర్' సినిమాలతో మెప్పించింది.   

5 /5

ఇటీవలే పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా తెరకెక్కిన 'వకీల్ సాబ్' చిత్రంలోనూ నటించింది. ఇప్పుడు రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్ లో రూపొందుతోన్న సినిమాలోనూ నటిస్తోంది.