7Th Pay Commission Dearness Allowance And Diwali Bonus: అక్టోబర్ 16న జరిగిన కేంద్ర క్యాబినెట్లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డియర్నెస్ అలవెన్స్ (DA)కు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. గణనీయంగా 3 శాతంకు పైగా పెంచుతూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ శుభవార్త వల్ల కోట్లాది ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు మేలు జరుగుతుంది.
అక్టోబరు 16న కేంద్ర ప్రభుత్వం డీఏ పెంపు పై చేసిన కీలక ప్రకటనకు సంబంధించిన నిర్ణయం.. దీపావళి పండగ సమయంలో ప్రభుత్వ ఉద్యోగులకు ఎంతో ఆనందాన్ని కలిగించింది.
కేంద్ర ప్రభుత్వం పెంచిన డియర్నెస్ అలవెన్స్ జూలై 1వ తేది నుంచి వర్తిస్తుంది. దీని కారణంగా ప్రభుత్వ ఉద్యోగులు మూడు నెలల పాటు అరియర్స్‌తో పాటు జీతాలు అందుతామి. అంతేకాకుండా కొత్త DAతో కాస్త జీతం కూడా పెరుగుతుంది.
కేంద్ర ప్రభుత్వం పెంచిన ఉద్యోగుల డీఏ 53 శాతంకు పెరుగుతుంది. అయితే ఇప్పటి వరకు కేవలం 50 శాతం మాత్రమే ఉండేది. కానీ ఇటీవలే ప్రకటనతో దాదాపు 3 శాతం వరకు పెరిగింది.
ఇక DAకి సంబంధించిన లెక్కల (7Th Pay Commission Salary Calculator) వివరాల్లోకి వెళితే..(బెసిక్ చెల్లింపు + గ్రేడ్ పే) × DA శాతం = DA మొత్తం)గా లెక్కిస్తారు. ఇదే గణన ప్రకారం, ప్రతి ఉద్యోగి డీఏను లెక్కిస్తారు.
ఇదే లెక్కల ప్రకారం చూస్తే బేసిక్ పే రూ. 10,000 పైగా ఉంటే.. ఇక గ్రేడ్ పే మాత్రం రూ.1 వేయి అనుకుంటే.. మీ టోటల్ జీతం కేవలం రూ.11 వేలు అవుతుంది. ఇక 53 శాతం DA రూ. 5 వేలు అవుతుంది. దీంతో నెలకు మీ జీతం రూ. 16,830 అవుతుంది.
డియర్నెస్ అలవెన్స్ అనేది ఒక ఉద్యోగి వివిధ ప్రమాణాలపై పెరుగుతున్న సరుకుల ఖర్చులతో పాటు ద్రవ్యోల్బణాన్ని ప్రభావాన్ని పూర్తిగా తగ్గించడానికే ఈ DA ద్రవ్య ప్రయోజనమని ఆర్థ శాస్త్రంలో పేర్కోన్నారు.
డీఏ లెక్కలను కేంద్రం ప్రతి ఆరు నెలలకు ఒకసారి సవరిస్తుంది. అయితే ఇలా చేసే సవరణల్లో పట్టణ ప్రాంత ఉద్యోగులకు, సెమీ-అర్బన్‌తో పాటు గ్రామీణ ప్రాంతాల్లోని ఉద్యోగులకు DAలో మార్పులు ఉండే అవకాశాలు ఉన్నాయి.