7th Pay Commission DA Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్. 7వ వేతన సంఘం ప్రకారం డీఏ పెంపుపై స్పష్టత వచ్చింది. ఉద్యోగులకు డీఏ ఈసారి 3 శాతం పెరగనుంది. మొత్తం డీఏ 53 శాతానికి చేరుకుంటుందా లేక జీరో నుంచి లెక్కిస్తారా అనేది తేలాల్సి ఉంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
7th Pay Commission DA Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న డీఏ పెంపుపై క్లారిటీ వచ్చేసింది. డీఏ ఎంత పెరగనుందో తేలింది. 7వ వేతన సంఘం సిఫార్సుల ప్రకారం జూలై డీఏ పెంపు 3 శాతం ఉండనుంది. త్వరలోనే అంటే ఈ నెలలో దీనికి సంబంధించిన ప్రకటన వెలువడనుంది.
ద్రవ్యోల్బణం రేటు ఆధారంగా కేంద్ర కార్మిక శాఖ ఏఐసీపీఐ ఇండెక్స్ ప్రతి నెలా జారీ చేస్తుంది. మే నెల ఇండెక్స్ 139.9 ఉంటే జూన్ నెలలో 141.4 శాతంగా ఉంది. ఇప్పుడు జూలై నెల డీఏ పెంపు ప్రకటన అక్టోబర్ 9న వెలువడనుంది. కానీ జూలై నుంచి లెక్కించి ఎరియర్ల రూపంలో ఇస్తారు.
డీఏ పెంపుతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతం కూడా స్వల్పంగా పెరగనుంది. కనీస వేతనం 18 వేలుంటే డీఏ నెలకు 540 రూపాయలు పెరగనుంది. అదే 56,900 కనీస వేతనం ఉన్నవారికి 1707 రూపాయలు డీఏ పెరుగుతుంది.
డీఏ 50 శాతం దాటితే మొత్తం డీఏను బేసిక్ శాలరీలో కలిపి జీరో నుంచి లెక్కించాలనే ప్రతిపాదన ఉంది. అందుకే ఇప్పుడు 3 శాతం డీఏ పెరిగితే 53 శాతం అవుతుంది. ఈ క్రమంలో డీఏను జీరో నుంచి లెక్కిస్తారా లేక 53 శాతం డీఏ అందిస్తారా అనేది ఇంకా స్పష్టత రావల్సి ఉంది.
జనవరి నుంచి జూన్ వరకూ లెక్కించిన ఏఐసీపీఐ ఇండెక్స్ ప్రకారం డీఏ 3 శాతం ఉండనుంది. అక్టోబర్ 9న జరగనున్న కేబినెట్ భేటీలో ప్రకటన వెలువడనుంది. అంటే దసరాకు ముందే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు బహుమతి లభించనుంది. ఇక డీఏ ఎలా ఉంటుందో తెలుసుకుందాం.
ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ 50 శాతంగా ఉంది. ఇప్పుడు ఏఐసీపీఐ ఇండెక్స్ ప్రకారం జూలైలో పెరగాల్సిన డీఏను 3 శాతంగా నిర్ణయించినట్టు తెలుస్తోంది. త్వరలో జరగనున్న కేబినెట్ భేటీలో ఇదే డీఏ ఖరారు కానుంది.