7th Pay Commission DA Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఊహించని షాక్.. డీఏ పెంపుపై బిగ్‌ అప్‌డేట్..!

7th Pay Commission Latest News: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు జూలై డీఏ పెంపు ప్రకటన కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నెల లేదా సెప్టెంబర్ నెలలో డీఏపై పెంపుపై కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేసే అవకాశం ఉంది. అయితే మోదీ 3.O ప్రభుత్వంలో ఈసారి ఎంత పెంపు ఉంటుందనేది ఆసక్తిగా మారింది. ఈ ఏడాది తొలి డీఏ 4 శాతం పెరగడంతో మొత్తం 50 శాతానికి చేరింది. అయితే మరోసారి 4 శాతం పెరుగుతుందని ఇప్పటివరకు ప్రచారం జరిగినా.. తాజాగా డీఏ పెంపుపై నింపుణుల అంచనాలు మారిపోయాయి.
 

1 /9

AICPI డేటా ఆధారంగా కేంద్ర ప్రభుత్వం డీఏ పెంపు ప్రకటన చేస్తున్న విషయం తెలిసిందే. జనవరి నుంచి జూన్ వరకు డేటా ఆధారంగా జూలై నెలకు సంబంధించిన డీఏను నిర్ణయిస్తుంది.  

2 /9

ఇప్పటివరకు జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే నెలలకు సంబంధించిన డేటా రిలీజ్ కాగా.. జూన్‌ నెలకు సంబంధించిన డేటా ఇంకా విడుదల చేయలేదు. జూన్ నెలకు సంబంధించిన AICPI డేటా కూడా వస్తే.. డీఏ పెంపుపై పూర్తి క్లారిటీ వస్తుంది.   

3 /9

అయితే ఇప్పటివరకు ఉన్న డేటా ఆధారంగా డీఏ 3 శాతమే పెరుగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుత ట్రెండ్స్‌ను బట్టి చూస్తే కాస్ట్ బేస్‌లో 3 శాతం మాత్రమే పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు.  

4 /9

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ 3 శాతం పెరిగితే.. మొత్తం డీఏ 53 శాతానికి చేరుకుంటుంది. ఇదే జరిగితే.. గత రెండేళ్లలో డీఏ 3 శాతం పెరగడం ఇదే తొలిసారి అవుతుంది.   

5 /9

కేంద్ర ప్రభుత్వం గత నాలుగు డీఏలను కూడా 4 శాతం చొప్పున పెంచుకుంటూ వచ్చిన విషయం తెలిసిందే. ఈసారి మాత్రం ఉద్యోగులకు షాక్ ఇవ్వనున్నట్లు వార్తలు వస్తున్నాయి.  

6 /9

జనవరిలో AICPI ఇండెక్స్ 138.9 పాయింట్ల వద్ద ఉండగా.. ద్రవ్యోల్బణం 50.84 శాతానికి పెరిగింది. ఆ తర్వాత ఫిబ్రవరిలో 139.2 పాయింట్లు, మార్చిలో 138.9, ఏప్రిల్‌లో 139.4, మేలో 139.9 పాయింట్లుగా ఉంది. దీంతో మే వరకు 52.91 శాతానికి చేరింది.  

7 /9

జూన్ నెలలో సూచీ 0.7 పాయింట్లు పెరిగినా.. 53.29 శాతానికి చేరుకుంటుందని నిపుణులు అంటున్నారు. డీఏ 4 శాతం పెరగాలంటే.. ఇండెక్స్ 143 పాయింట్లకు చేరుకోవాలని చెబుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఇది అసాధ్యం అనిపిస్తుందంటున్నారు. ఇండెక్స్‌లో ఇంత పెద్ద పెరుగుదల కష్టమంటున్నారు. దీంతో ఈసారి డీఏ పెంపు 3 శాతం ఉంటుందని అంచనా వేస్తున్నారు.   

8 /9

AICPI ఇండెక్స్ డేటాను లేబర్ బ్యూరో ఆర్థిక మంత్రిత్వ శాఖకు సమర్పిస్తుంది. ఆర్థిక మంత్రిత్వ శాఖ సిఫారసు మేరకు డీఏ పెంపుపై కేంద్రమంత్రి వర్గం ఆమోద ముద్ర వేస్తుంది. డీఏ పెంపు ప్రకటన ఎప్పుడు వెలువడినా.. జూలై 1వ తేదీ నుంచి అమలులోకి వస్తుంది.   

9 /9

గమనిక: ఇక్కడ అందజేసిన సమాచారం ఉద్యోగుల ప్రయోజనాల కోసం మాత్రమే. వేతన రేటు పెంపుదలకు లేదా తదుపరి వేతన కమిషన్‌కు ఏర్పాటుపై అధికారిక సమాచారం కాదు. కచ్చితమైన సమాచారం కోసం అధికారిక ప్రభుత్వ వెబ్‌సైట్‌లను సందర్శించండి.