7th Pay Commission Latest Updates: ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు డీఏ, డీఆర్ పెంపు ప్రకటన కోసం ఎదురుచూస్తున్నారు. త్వరలోనే మోదీ ప్రభుత్వం వరుసగా గుడ్‌న్యూస్‌లు అందించనుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ ఏడాది జనవరిలో మొదటి డీఏ నాలుగు శాతం పెంచడంతో మొత్తం డీఏ 50 శాతానికి చేరింది. ఇప్పుడు రెండో డీఏ పెంపు ప్రకటన త్వరలోనే ఉండనుంది. డీఏ పెంపుతో పాటు మరో 2 శుభవార్తలు రానున్నాయని ప్రచారం జరుగుతోంది.
కేంద్ర ప్రభుత్వం త్వరలోనే పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. బడ్జెట్‌లో ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వరాల జల్లు కురిపిస్తారని ఉద్యోగులు ఆశలు పెట్టుకున్నారు.
ఈ ఏడాది రెండో డీఏ పెంపు ఆగస్టు లేదా సెప్టెంబర్‌లో ఉండే అవకాశం ఉంది. అయితే డీఏ పెంపు ప్రకటన ఎప్పుడు వచ్చినా.. జూలై 1వ తేదీ నుంచి అమలు చేస్తారు.
ఎప్పటిలాగే AICPI ఇండెక్స్ డేటా ఆధారంగా డీఏను పెంచనున్నారు. ఈసారి కూడా 4 శాతం డీఏ పెంచే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
డీఏ పెంపుతోపాటు ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ పెంచే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ 2.57 శాతం నుంచి 3.68 శాతానికి పెంచాలని ఉద్యోగులు కోరుతున్నారు.
ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ 3.68 శాతానికి పెంచితే.. జీతం 44 శాతం పెరుగుతుంది. దీంతో ఉద్యోగుల జీతాల్లో బంపర్ పెరుగుదల ఉంటుంది.
అంతేకాకుండా కరోనా కాలంలో నిలిపివేసిన 18 నెలల డీఏను కూడా చెల్లించాలనే డిమాండ్ చాలా రోజులుగా ఉంది. ఇదే జరిగితే ఉద్యోగులకు, పింఛన్‌దారులకు భారీ ప్రయోజనం చేకూరనుంది.
గమనిక: ఇక్కడ అందజేసిన సమాచారం ఉద్యోగుల ప్రయోజనాల కోసం మాత్రమే. వేతన రేటు పెంపుదలకు లేదా తదుపరి వేతన కమిషన్‌కు ఏర్పాటుపై అధికారిక సమాచారం కాదు. కచ్చితమైన సమాచారం కోసం అధికారిక ప్రభుత్వ వెబ్‌సైట్‌లను సందర్శించండి.