8th Pay Commission Salary Hike: జూలై 23న ప్రవేశపెట్టిన సాధారణ బడ్జెట్లో 8వ వేతన సంఘంపై ప్రకటన లేకపోవడంతో నిరాశ చెందిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంపు ఊరటనివ్వనుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
7th Pay Commission Latest Updates: ప్రభుత్వ ఉద్యోగులకు ఏడాదికి రెండు సార్లు అంటే జనవరి, జూలై నెలల్లో డీఏ పెంపు ఉంటుంది. డీఏ పెంపు అనేది ఏఐసీపీఐ ఇండెక్స్ ఆధారంగా లెక్కిస్తారు. ఈసారి జూలైలో పెరగాల్సిన డీఏ 4-5 శాతం ఉంటే జీతాలు భారీగా పెరగనున్నాయి.
డీఏ నిబంధనల ప్రకారం 50 శాతం దాటితే మొత్తం డీఏను కనీస వేతనంలో కలపాల్సి ఉంటుంది. అంటే జీతాలు భారీగా పెరగనున్నాయి.
ప్రతి యేటా జనవరి డీఏ పెంపు ప్రకటన మార్చ్ నెలలో ఉంటుంది. జూలై పెంపు సెప్టెంబర్ నెలలో ఉంటుంది.
ఇప్పటి వరకూ ఉన్న ఏఐసీపీఐ ఇండెక్స్ ప్రకారం ఈసారి డీఏ పెంపు 4 నుంచి 5 శాతం ఉండవచ్చని అంచనా. ప్రస్తుతం డీఏ 50 శాతానికి చేరుకుని ఉంది. ఇప్పుడు మరో 4 శాతం పెరిగితే 54 శాతానికి చేరుకుంటుంది. కానీ 50 శాతం డీఏ దాటినప్పుడు మొత్తం డీఏను కనీస వేతనంలో కలిపి తిరిగి జీరో నుంచి లెక్కిస్తారు.
7వ వేతన సంఘం ప్రకారం ఏడాదికి రెండు సార్లు పెంచాల్సి ఉంటుంది. జనవరిలో 4 శాతం పెరిగింది. ఇప్పుడు తిరిగి జూలైలో పెంపు ఉంటుంది. జనవరి నుంచి జూన్ వరకు ఏఐసీపీఐ ఇండెక్స్ ఆధారంగా డీఏ పెంపు నిర్ణయమౌతుంది.
మరోవైపు జూలై నెలలో డీఏ పెరగాల్సి ఉంది. 8వ వేతన సంఘం నిరాశ పర్చినా కనీసం డీఏ అయినా పెరుగుతుందని ఆశిస్తున్నారు.
ఇప్పటికే ఈ విషయమై కేంద్ర ఆర్ధిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి వివరణ ఇచ్చారు. 8వ వేతన సంఘం ఏర్పాటుపై రెండు విజ్ఞప్తులు వచ్చాయని, ప్రభుత్వ పరిశీలిస్తోందని చెప్పారు.
వాస్తవానికి 8వ వేతన సంఘం ఏర్పాటు చేయాలని ఉద్యోగులు చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే సాధారణంగా 10 సంవత్సరాలకు పే కమీషన్ ఏర్పడుతుంటుంది. 7వ వేతన సంఘం 2016లో అమల్లోకి వచ్చింది. అంటే 2026లో 8వ వేతన సంఘం అమల్లోకి రావల్సి ఉంటుంది. అందుకే ప్రకటన ఇప్పుడు వెలువడాల్సిన పరిస్థితి.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. 8వ వేతన సంఘం ఏర్పాటు ప్రకటన కోసం ఎదురు చూస్తున్న ఉద్యోగులకు డీఏ పెంపు ప్రకటన వినవచ్చు. దీనికి సంబంధించిన అప్ డేట్స్ ఇలా ఉన్నాయి.