Divorce Year: 2024 విడాకుల నామ సంవత్సరం .. ఈ ఏడాదిలో విడాకులు తీసుకున్న హీరో, హీరోయిన్లు వీరే

These Celebrities Got Divorced In 2024: ఈ ఏడాదిని విడాకుల నామ సంవత్సరంగా పిలవవచ్చు. సినీ, క్రీడా ప్రముఖులు భారీగా విడాకులు తీసుకున్నారు. ఏఆర్‌ రహమన్‌, సానియా మీర్జా, ధనుష్‌, హార్దిక్‌ పాండ్యా తదితరులు విడాకులు పొందారు. తమ వైవాహిక జీవితాన్ని రద్దు చేసుకున్నారు.

1 /6

ఆస్కార్‌ విజేత: ఆస్కార్‌ అవార్డు గ్రహీత ఏఆర్‌ రెహమాన్, సైరా బాను ఇటీవల విడాకులు పొందారు. 29 సంవత్సరాల సుదీర్ఘ దాంపత్య ముగిసింది. 

2 /6

బాలీవుడ్‌ జంట: బాలీవుడ్‌ నటి ఊర్మిళ మొహ్సిన్ తన జీవిత భాగస్వామి మోహసిన్‌ అక్తర్ మీర్‌ను ఈ ఏడాది వదిలేశారు. పెళ్లయిన ఎనిమిదేళ్ల తర్వాత తన భర్త మొహ్సిన్ అక్తర్ మీర్ నుంచి ఆమె విడాకులు పొందారు.

3 /6

సానియా మీర్జా, షోయబ్ మాలిక్: క్రీడా ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిన విడాకులు సానియా మీర్జా, షోయబ్ మాలిక్‌వి. పెళ్లయిన 14 సంవత్సరాల తర్వాత ఈ ఏడాది జనవరిలో విడాకులు తీసుకున్నారు. విడాకుల తర్వాత షోయబ్‌ పాకిస్థానీ నటి సనా జావేద్‌ను పెళ్లి చేసుకున్నారు.

4 /6

ఇషా డియోల్, భరత్ తఖ్తానీ: ఫిబ్రవరి 2024లో బాలీవుడ్‌ నటి ఈషా డియోల్, భరత్ తఖ్తానీ విడాకులు పొందారు. వీరిద్దరూ 11 సంవత్సరాల కిందట వివాహం చేసుకున్నారు. ఈ జంటకు రాధ్య, మిరయా అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

5 /6

క్రికెట్‌ రంగంలో..: భారత స్టార్‌ క్రికెటర్‌ హార్దిక్ పాండ్యా ఈ ఏడాదిలో విడాకులు పొందాడు. నటాసా స్టాంకోవిచ్‌తో నాలుగు సంవత్సరాల వివాహ బంధాన్ని తెంచుకున్నారు. 18 జూలై 2024న ఈ జంట తమ సామాజిక మాధ్యమాల ద్వారా విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించారు.

6 /6

అర్జున్ కపూర్,మలైకా అరోరా: బాలీవుడ్‌ స్టార్‌ నటుడు అర్జున్ కపూర్ తన ప్రియురాలు మలైకా అరోరాను వదిలేశారని సమాచారం.  మలైకా తన భర్త అర్బాజ్ ఖాన్‌తో విడిపోయిన తర్వాత 2018లో అర్జున్‌తో డేటింగ్ ప్రారంభించారు. ఈ ఏడాది ప్రారంభంలోనే అర్జున్‌, మలైకా విడిపోయారు.