UAE News: హెల్త్ వర్కర్స్ పిల్లలకు ఉచిత విద్య

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

Last Updated : Aug 30, 2020, 04:04 PM IST
    • యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
    • కరోనావైరస్ సంక్రమణ సమయంలో తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా సేవ చేస్తున్న హెల్త్ వర్కర్స్ కు చేయూతనిస్తోంది.
UAE News: హెల్త్ వర్కర్స్ పిల్లలకు ఉచిత విద్య

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనావైరస్ సంక్రమణ సమయంలో తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా సేవ చేస్తున్నహెల్త్ వర్కర్స్ కు చేయూతనిస్తోంది. ఆరోగ్య సిబ్బందిని ఆదుకుందాం అని వారి పిల్లలకు ఉచిత విద్య అందించేందుకు నిర్ణయించింది యూఏఈ ( UAE) విద్యా మంత్రిత్వ శాఖ. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో వారికి పదవ తరగతి వరకు ఉచిత విద్యను అందించనున్నారు.

 

Class XII వరకు ఆరోగ్య కార్యకర్తల పిల్లలకు అయ్యే ఖర్చును అంతా యూఏఈ ప్రభుత్వమే భరించనుంది. కోవిడ్- 19  (Covid19) సంక్రమణను అరికట్టేందకు తమ ప్రాణాలను కూడా లెక్క చేయకుండా దేశానికి సేవ చేస్తున్న వైద్య సిబ్బందికి ఇలా గౌరవం ఇస్తోంది ప్రభుత్వం.

Trending News