Indian Student stabbed: ఆస్ట్రేలియాలో దారుణ ఘటన.. డబ్బు కోసం ఇండియన్ స్టూడెంట్ పై కత్తిపోట్లు

Brutal Attack on indian Student in Australia: భారతీయ విద్యార్థి పై ఆస్ట్రేలియాలో దారుణంగా దాడి జరిగింది. ఏకంగా 11 పోట్లు పొడిచారు దుండగులు.. 

Written by - Chaganti Bhargav | Last Updated : Oct 14, 2022, 03:29 PM IST
Indian Student stabbed: ఆస్ట్రేలియాలో దారుణ ఘటన.. డబ్బు కోసం ఇండియన్ స్టూడెంట్ పై కత్తిపోట్లు

Brutal Attack on indian Student in Australia: 28 ఏళ్ల భారతీయ విద్యార్థిపై ఆస్ట్రేలియాలో దారుణంగా దాడి జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. భారతదేశానికి చెందిన ఒక విద్యార్థి ముఖం, ఛాతీ, పొట్టపై పలుమార్లు కత్తిపోట్లు పొడిచారు దుండగులు. అతని వద్ద ఉన్న డబ్బు దోపిడి చేయాలనే ఉద్దేశంతో దుండగులు ఈ దాడికి పాల్పడ్డారని పోలీసులు అభిప్రాయపడ్డారు. అక్టోబర్ 6వ తేదీ రాత్రి 10:30 గంటలకు ఈ ఘటన జరిగినట్లు న్యూ సౌత్ వేల్స్ పోలీసులు ప్రకటించారు.

న్యూ సౌత్ వేల్స్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం దాడి జరిగిన విద్యార్థిని శుభమ్ గార్గ్‌గా గుర్తించారు. శుభమ్ గార్గ్ పసిఫిక్ హైవేపై నడుచుకుంటూ వెళ్తుండగా ఈ ఘటన జరిగిందని, గుర్తు తెలియని వ్యక్తి గార్గ్ వద్దకు వచ్చి డబ్బు డిమాండ్ చేస్తూ బెదిరించడం ప్రారంభించాడని చెబుతున్నారు. అయితే శుభమ్ డబ్బులు ఇచ్చేందుకు నిరాకరించడంతో దుండగుడు కత్తితో పలుమార్లు పొడిచి పారిపోయాడని, ఈ ఘటనలో గార్గ్ ముఖం, ఛాతీ, పొత్తికడుపుపై ​​పలుమార్లు కత్తిపోట్లకు గురైనట్లు పోలీసులు తెలిపారు.

తీవ్ర గాయాలతో సమీపంలోని ఇంట్లో నివసిస్తున్న వారి నుంచి శుభమ్ సహాయం కోరాడంతో వారు దగ్గర్లోని రాయల్ నార్త్ షోర్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఇక గార్గ్‌కు ఆసుపత్రిలో శస్త్రచికిత్స జరిగింది, అయితే అక్కడ అతని పరిస్థితి విషమంగా ఉందని అంటున్నారు. ఇక ఈ దాడి కేసులో 27 ఏళ్ల డేనియల్ నార్వుడ్‌ను పోలీసులు అరెస్టు చేశారని, అతనిపై హత్యాయత్నం అభియోగాలు మోపారని డైలీ టెలిగ్రాఫ్ వార్తాపత్రిక రిపోర్ట్ చేసింది.

ఇక ఆ వార్తాపత్రిక కథనం మేరకు డేనియల్ ఇంటి నుండి అనేక వస్తువులు స్వాధీనం చేసుకుని వాటిని ఫోరెన్సిక్ పరీక్షకు పంపారు. ఇక నిందితుడిని సోమవారం హార్న్స్‌బీలోని స్థానిక కోర్టులో హాజరుపరచగా అతను బెయిల్ కోసం ప్రయత్నించాడు, అయితే అతనికి బెయిల్ మంజూరు చేయడానికి కోర్టు నిరాకరించింది. ఈ దాడిని హేయమైనదిగా అభివర్ణిస్తూ భారతీయ సమాజానికి ఎలాంటి ముప్పు లేదని సిడ్నీ పోలీసులు ఒక ప్రకటన విడుదల చేశారు.  

ఇక ఈ సంఘటన తర్వాత, ఆగ్రాలో నివసిస్తున్న విద్యార్థి కుటుంబ సభ్యులందరూ విషాదంలో మునిగిపోయారు.  శుభమ్ తండ్రి రామ్‌నివాస్ గార్గ్ మాట్లాడుతూ, దాడి చేసిన వ్యక్తి శుభమ్ లేదా అతని స్నేహితులలో ఎవరికీ తెలియదని చెప్పినట్లు తెలుస్తోంది. ఇది జాతి వివక్ష అని శుభమ్ కుటుంబం అభివర్ణించింది. ఇక శుభమ్ మద్రాస్ ఐఐటీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి గత నెలలోనే ఆస్ట్రేలియాకు వెళ్లి అక్కడ మెకానికల్ ఇంజనీరింగ్‌లో పిహెచ్‌డి చదువుతున్నాడు.

శుభమ్ కుటుంబం ఆస్ట్రేలియా వెళ్లడానికి వీసా కోసం దరఖాస్తు చేసింది, అయితే వారికి ఇంకా వీసా లభించలేదని అంటున్నారు ఈ క్రమంలో వీసా కోసం ఆ కుటుంబం ఆందోళన చెంది అధికారులను ఆ వీసా ఇప్పించమని వేడుకుంటున్నారు. ఇక శుభమ్ సోదరుడి వీసా దరఖాస్తు ప్రక్రియ ఇంకా కొనసాగుతోందని అధికారులు చెబుతున్నారు. ఈ విషయమై జిల్లా యంత్రాంగం విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది.

ఆగ్రా జిల్లా మేజిస్ట్రేట్ నవనీత్ చాహల్ మాట్లాడుతూ, ఇది జాతిపరమైన దాడిగా అనిపిస్తోందని, బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని మేము భారత ప్రభుత్వాన్ని కోరుతున్నామని అన్నారు. ఇక సిడ్నీలోని భారత రాయబార కార్యాలయ అధికారులతో మాట్లాడానని, త్వరలో శుభమ్ సోదరుడికి వీసా వస్తుందని చాహల్ పేర్కొన్నారు. ఇంటి అద్దె చెల్లించేందుకు ఏటీఎం నుంచి 800 డాలర్లు డ్రా చేసి శుభమ్ అక్టోబర్ 6న రాత్రి 10 గంటల ప్రాంతంలో గదికి వెళ్తున్న సమయంలో కత్తితో దాడి జరిగినట్లు తెలుస్తోంది. 

Also Read: Canada New Work Hour Rules: వారానికి 20 గంటల పని నిబంధన తొలగింపు, భారతీయ విద్యార్ధులకు ఎలా ప్రయోజనకరం

Also Read: California Kidnap: కాలిఫోర్నియాలో కలకలం, 8 ఏళ్ల చిన్నారి సహా భారత సంతతి కుటుంబం కిడ్నాప్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News