సింగపూర్ ప్రధాన ప్రతిపక్ష నేతగా భారత సంతతి ఎంపీ

సింగపూర్ ప్రధాన ప్రతిపక్ష పార్టీ నేతగా భారత సంతతి ఎంపీ ప్రీతం సింగ్ ఆదివారం ఎన్నికయ్యారు.

Last Updated : Apr 9, 2018, 04:17 PM IST
సింగపూర్ ప్రధాన ప్రతిపక్ష నేతగా భారత సంతతి ఎంపీ

సింగపూర్ ప్రధాన ప్రతిపక్ష పార్టీ నేతగా భారత సంతతి ఎంపీ ప్రీతం సింగ్ ఆదివారం ఎన్నికయ్యారు. సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఎన్నికల్లో సింగపూర్ ప్రతిపక్ష వర్కర్స్ పార్టీ కొత్త సెక్రెటరీ జనరల్‌గా ప్రీతంను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. న్యాయవాదిగా విధులు నిర్వర్తించే ప్రీతం సింగ్ (41).. ఎంపీ లో థియా ఖియాంగ్(61) నుండి బాధ్యతలు తీసుకున్నారు. ప్రతిపక్ష నేతగా ప్రీతం ఎన్నికకావడం పట్ల పలువురు అభినందనలు తెలిపారు.

ప్రీతం 2011 మేలో జరిగిన ఎన్నికల్లో పార్లమెంటుకు ఎన్నికయ్యారు. ప్రితమ్ సింగ్ సింగపూర్‌లో ఓ పట్టణానికి కౌన్సిల్ చైర్మన్ కూడా. ఈయన సింగపూర్ ఈశాన్య-తూర్పు ప్రాంతం.. ఐదుగురు సభ్యుల ప్రాతినిథ్య బృంద నియోజకవర్గమైన అల్జునైడ్ గ్రూప్ రెప్రజెంటేషన్ నియోజకవర్గ ఎంపీ.  2001 నుంచి వర్కర్స్ పార్టీ సెక్రటరీ జనరల్‌గా వ్యవహరిస్తున్న లో థియా ఖియాంగ్.. తాను తిరిగి పోటీచేయనని ప్రకటించారు. యువతకు ప్రాధాన్యం ఇచ్చేలా ఈ నిర్ణయం తీసుకున్నట్టు గత నవంబర్‌లోనే వెల్లడించారు. ఖియాంగ్ ప్రకటనతో సెక్రటరీ జనరల్ పదవి కోసం ప్రీతం సింగ్ పేరు ముందువరుసలో నిలిచింది. సిల్వియా లిం ఛైర్మన్‌గా తిరిగి ఎన్నికయ్యారు.

Trending News