Telangana Youth Shot Dead: అమెరికాలో తెలంగాణ యువకుడి హత్య.. నల్ల జాతీయుడి కాల్పుల్లో మృతి..

Telangana Youth Shot Dead in USA: అమెరికాలో ఓ తెలంగాణ యువకుడు హత్యకు గురయ్యాడు. ఓ నల్ల జాతీయుడు జరిపిన కాల్పుల్లో అతను మృతి చెందాడు.  

Written by - ZH Telugu Desk | Last Updated : Jun 23, 2022, 11:04 AM IST
  • అమెరికాలో దారుణం
  • మేరీల్యాండ్‌లో జరిగిన కాల్పుల్లో నల్గొండ యువకుడు మృతి
  • మృతుడు 26 ఏళ్ల సాయి చరణ్‌గా గుర్తింపు
Telangana Youth Shot Dead: అమెరికాలో తెలంగాణ యువకుడి హత్య.. నల్ల జాతీయుడి కాల్పుల్లో మృతి..

Telangana Youth Shot Dead in USA: అమెరికాలో కాల్పుల ఘటనలు తీవ్ర ఆందోళన రేకెత్తిస్తున్నాయి.  ఎప్పుడు ఎక్కడ ఎవరు గన్‌తో విరుచుకుపడుతారో తెలియని పరిస్థితి అక్కడ నెలకొంది. ఇటీవలి కాలంలో చోటు చేసుకున్న వరుస కాల్పుల ఘటనల్లో పదుల సంఖ్యలో అమాయకులు బలైపోయారు. తాజాగా తెలంగాణలోని నల్గొండకు చెందిన ఓ యువకుడు అమెరికాలో జరిగిన కాల్పుల్లో మృతి చెందాడు. దీంతో నల్గొండలోని అతని నివాసంలో తీవ్ర విషాదం అలుముకుంది.

నల్గొండలోని వివేకానంద కాలనీకి చెందిన నక్కా పద్మ-నరసింహ దంపతుల కుమారుడు నక్కా సాయి చరణ్ (26) ప్రస్తుతం అమెరికాలోని మేరీల్యాండ్‌లో ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీరింగ్‌గా పనిచేస్తున్నాడు. ఆదివారం (జూన్ 19) సాయంత్రం తన స్నేహితుడిని ఎయిర్‌పోర్టులో దింపి ఇంటికి వెళ్తుండగా కాటన్స్‌విల్లే వద్ద ఓ నల్ల జాతీయుడు సాయి చరణ్‌పై కాల్పులు జరిపారు. స్థానికులు వెంటనే అతన్ని మేరీల్యాండ్ ఆర్ ఆడమ్స్ ట్రామా సెంటర్‌కు తరలించగా.. ఆ తర్వాత కొద్దిసేపటికే అతను మృతి చెందాడు.దీనిపై సాయి చరణ్ కుటుంబ సభ్యులకు సోమవారం (జూన్ 20) సాయంత్రం సమాచారం అందింది.

సాయి చరణ్ అమెరికాలోని సిన్సినాటీ యూనివర్సిటీలో మాస్టర్స్ పూర్తి చేసి అక్కడే ఉద్యోగం చేస్తున్నాడు. రెండున్నరేళ్ల క్రితం తమ కుమారుడు అమెరికా వెళ్లినట్లు సాయి చరణ్ తండ్రి తెలిపారు. చివరిసారిగా శనివారం (జూన్ 18) తమతో ఫోన్‌లో మాట్లాడినట్లు చెప్పారు. సాయి చరణ్‌కు ఇంకా వివాహం కాలేదన్నారు. సాయి చరణ్ సోదరి కూడా ప్రస్తుతం అమెరికాలోనే ఉంటోందని చెప్పారు. సాయి చరణ్ మృతదేహాన్ని ఇండియాకు తీసుకొచ్చేందుకు సహకరించాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆయన విజ్ఞప్తి చేశారు. సాయి చరణ్ మృతితో అతని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. 
 

Also Read: Corona Updates in India: భారత్‌లో కరోనా టెర్రర్..తాజాగా కేసులు ఎన్నంటే..!

Also Read: Megastar Chiranjeevi : ఆ పుకార్లకు చెక్ పెట్టే ప్లాన్.. ముందు జాగ్రత్త పడుతున్నారా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News