Mega fans vs Jr NTR fans over Andhrawala Audio Release: తెలుగు సినీ చరిత్రలో మరుపురాని మరచిపోలేని ఆడియో రిలీజ్ ఈవెంట్ ఏదైనా ఉందా అంటే అది ఆంధ్రావాలా అని చెప్పక తప్పదు. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా పూరీ జగన్నాథ్ డైరెక్టర్‌గా వ్యవహరించిన ఈ సినిమాని అప్పట్లో ఆర్ఆర్ వెంకట్ అనే ఆయన నిర్మించారు. అయితే ప్రస్తుత వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని అప్పట్లో ఎన్టీఆర్ వెన్నంటే ఉండి అన్నీ చూసుకునేవారు. నిజానికి అప్పట్లో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లాంటి ఆడియో రిలీజ్ ఈవెంట్ ని జూనియర్ ఎన్టీఆర్ తాత అయిన సీనియర్ ఎన్టీఆర్ స్వగ్రామం నిమ్మకూరులో నిర్వహించారు.
10 lakhs crowd ki 60 lakhs cash ante manishiki Rs 6 ivvali
Ah 6 Rs kosam Mitta Madyanam nunchi Ratri varaku vunnara..?
Ah chillara kosam lakshala mandi train lu bus lu yekki alla vacharu. Nice ra Megays 😹ilanti Audio launch chekka gadi batukki chudaleru kabatti e yedupulu… pic.twitter.com/fLfgoqsbW4
— NTR EDITS (@Movies_Ntr) April 14, 2023
అప్పట్లో రెండు తెలుగు రాష్ట్రాలు కలిసే ఉండేవి. 2003లో జరిగిన ఈ ఆడియో రిలీజ్ ఈవెంట్ గురించి కొడాలి నాని తాజాగా వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నాయుడు నిమ్మకూరుకు చేసిన అభివృద్ధి ఏమీ లేదని చెబుతూనే ఆ రోజుల్లో తాను 20 లక్షలు ఎన్టీఆర్ 40 లక్షలు మొత్తం 60 లక్షల రూపాయలతో పాటు కోటి రూపాయలు ఖర్చు చేసి హైదరాబాద్ సహా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుంచి బస్సులు రైళ్లు వేసి సుమారు 10 లక్షల మందిని నిమ్మకూరు తీసుకొచ్చి బసవతారకం, తారక రామారావు ఇద్దరికీ ఘనంగా నివాళులర్పించామని చెప్పుకొచ్చారు.
ఇది కూడా చదవండి: Samantha Divorce: నాగచైతన్య మంచి కోరే సమంత విడాకులు ఇచ్చిందా.. వెలుగులోకి షాకింగ్ అంశం!
అయితే కొడాలి నాని ఎందుకు ఆ మాటలు మాట్లాడారో తెలియదు కానీ ఇప్పుడు ఈ విషయం మీద మెగా ఫ్యాన్స్ వర్సెస్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అన్నట్లుగా వార్ సాగుతోంది. ఇప్పటివరకు ఆంధ్రావాలా ఆడియో రిలీజ్ ఈవెంట్ కి అభిమానులు, టిడిపి నేతలు వచ్చారనుకున్నాం కానీ ఇలా డబ్బులు ఇచ్చి జనాల్ని తరలించారా, ఇదా మీ బతుకు ఇంకోసారి ఈ రికార్డు ఉందని చెప్పుకోవద్దు, వినడానికి చాలా చిరాగ్గా ఉందని మెగా ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.
Kodali nani about "Andhrawala" Function..
Idhi mee bathukuu💦💦💦
TDP cadre anukunnam ippatidhaka adhi kuda kaadhu anta dabbulu petti gather chesaru anta
Inkeppudu Andhra wala function raawwww anakandi baagodhuuu pic.twitter.com/lwBAlSYyul
— S U B B U (@SubbuGorre) April 14, 2023
దీంతో కొడాలి నాని చెప్పినట్టు 60 లక్షల ఖర్చు చేశారు అనుకున్నా 60 లక్షల రూపాయలు 10 లక్షల మందికి ఇవ్వాలంటే ఆరు రూపాయలు ఇవ్వాలని ఆరు రూపాయల కోసం ఎవరైనా పనులు మానుకుని ఎన్టీఆర్ కోసం పూరి జగన్నాథ్ కోసం ఎదురుచూస్తూ ఉంటారా? అంటూ ఎన్టీఆర్ అభిమానులు కామెంట్ చేస్తున్నారు. నిజానికి ఈ వ్యవహారం ఎప్పుడో సద్దుమణిగిపోయింది, సినిమా డిజాస్టర్ కావడంతో ఈ సినిమాని తలుచుకోవడానికి కూడా ఎన్టీఆర్ అభిమానులు బాధపడుతూ ఉంటారు. అలాంటిది కొడాలి నాని పుణ్యమా అని మరోసారి ఈ అంశం తెర మీదకు వచ్చినట్టు అయిందని అంటున్నారు.
ఇది కూడా చదవండి: Rudrudu Movie Review: ఆ నరుకుడేంది? మాకు బాలయ్య ఉన్నాడుగా లారెన్స్.. ఇదేం అరాచకమయ్యా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook