Disha Encounter Case Hearing: హై కోర్టులో కీలక దశకు చేరుకున్న దిశ ఎన్‌కౌంటర్ కేసు విచారణ!

Disha Encounter Case Hearing Latest Update: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ ఎన్ కౌంటర్ కేసులో నేడు తెలంగాణ హై కోర్టులో విచారణ జరిగింది. ఈ కేసులో ఇరు వర్గాల వాదనలు విన్న ఉన్నత న్యాయస్థానం.. కేసు తదుపరి విచారణను జూన్ 21కి వాయిదా వేసింది. 

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 14, 2023, 03:04 PM IST
Disha Encounter Case Hearing: హై కోర్టులో కీలక దశకు చేరుకున్న దిశ ఎన్‌కౌంటర్ కేసు విచారణ!

Disha Encounter Case Hearing Latest Update: దిశ ఎన్‌కౌంటర్ కేసులో కమిషన్ నివేదిక అందించిన నివేదికపై నేడు తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. ప్రభుత్వం తరఫున అడ్వకేట్ నిరంజన్ రెడ్డి వాదనలు వినిపించగా.. ఎన్‌కౌంటర్ బాధితుల తరపున లాయర్ కృష్ణమాచార్య హైకోర్టులో వాదనలు వినిపించారు. ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్న 10 మంది పోలీసు అధికారులకు తెలంగాణ హైకోర్టు నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఎన్‌కౌంటర్ సమయంలో పోలీసు కమిషనర్‌గా ఉన్న వీసీ సజ్జనార్ ఈ కేసులో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో వీసీ సజ్జనార్ కి కూడా హై కోర్టు నోటీస్ జారీ చేసింది. 

దిశ గ్యాంగ్ రేప్, మర్డర్ కేసులో నిందితుల ఎన్ కౌంటర్ విషయంలో అనేక అనుమానాలు వ్యక్తమైన నేపథ్యంలో నిందితులను ఏ పరిస్థితుల్లో ఎన్‌కౌంటర్ చేయాల్సి వచ్చింది, అసలు ఈ ఎన్‌కౌంటర్ ఎలా జరిగింది అనే  వివరణ ఇవ్వాల్సిందిగా హై కోర్టు ఆ నోటీసుల్లో స్పష్టంచేసింది. ఈ ఎన్‌కౌంటర్‌ లో తమ తప్పు లేదనే విషయాన్ని తగిన సాక్ష్యాధారాలతో నిరూపించుకోవాల్సిందిగా తెలంగాణ హై కోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే పలుమార్లు దిశ ఎన్ కౌంటర్ కేసుపై విచారణ జరిగింది.

మరోవైపు ఎన్‌కౌంటర్ లో పాల్గొన్న పోలీసులపై ఐపిసి సెక్షన్ 302 కింద మర్డర్ కేసు పెట్టాలని హైకోర్ట్ విజ్ఞప్తి చేసినట్టు దిశ ఎన్‌కౌంటర్ కేసు బాధితుల తరపున వాదనలు వినిపించిన కృష్ణమాచార్య తెలిపారు. బాధితుల కుటుంబాలకు నష్టపరిహారం ఇవ్వాలి అని కూడా హైకోర్టుకు విన్నవించాం. హైకోర్టు స్పందించిన తీరు చూస్తోంటే.. బాధితులకు ప్రభుత్వం తరపున నష్టపరిహారం అందించే అంశంలో సానుకూలంగా ఉన్నట్టు అనిపిస్తోందని అన్నారు. 

ఇది కూడా చదవండి: Khammam Fire Accident: బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో విషాదం.. భారీ అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, 8 మందికి గాయాలు

ప్రభుత్వం తరపున నిరంజన్ రెడ్డి వాదనలు వినిపిస్తూ.. తప్పనిసరి పరిస్థితుల్లోనే ఆత్మరక్షణ కోసం పోలీసులు కాల్పులు జరపాల్సి వచ్చిందని అన్నారు. ఇరువర్గాల వాదనలు విన్న అనంతరం హైకోర్టు ఈ కేసును జూన్ 21 వాయిదా వేసింది. కాగా హై కోర్టులో దిశ ఎన్‌కౌంటర్ కేసు విచారణ తుది ఘట్టానికి చేరుకున్నట్టు తెలుస్తోంది. మరో రెండు వాయిదాల్లో తీర్పు వెలువడే అవకాశం కూడా ఉన్నట్టు సమాచారం అందుతోంది.

ఇది కూడా చదవండి: EC Shock to BRS Party: బీఆర్ఎస్ పార్టీకి షాకిచ్చిన కేంద్ర ఎన్నికల సంఘం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook

Trending News