Chandra Grahan on Budh Purnima Effects in Telugu: మనందరికీ తెలుసు గ్రహణం సమయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. పెద్దలు అనేక శాస్త్రాలలో చెప్పినట్టుగా అనేక విషయాల్లో చాలా నియమ నిబంధనలు కూడా ఏర్పరిచారు. ఇక ఈ ఏడాది 2023వ సంవత్సరంలో నాలుగు గ్రహణాలు ఏర్పడుతున్నాయి. అందులో రెండు సూర్యగ్రహణాలు అయితే మరో రెండు చంద్రగ్రహణాలు. ఇక చంద్రగ్రహణాల విషయానికి వస్తే మొదటి చంద్రగ్రహమును మే 5వ తేదీ శుక్రవారం నాడు సంభవించబోతోంది.
అయితే అదే రోజు బుద్ధ పౌర్ణమి కూడా కావడం గమనార్హం. వాస్తవానికి గౌతమ బుద్ధుడు వైశాఖ పౌర్ణమి రోజున జన్మించాడు. ఆ రోజునే బుద్ధ పౌర్ణమిగా జరుపుకుంటూ ఉంటారు బౌద్ధులు. పౌర్ణమి రోజున బుద్ధున్ని భక్తిశ్రద్ధలతో పూజించి పలు కార్యక్రమాలు కూడా నిర్వహిస్తారు. ఈ సంవత్సరం బుద్ధ పూర్ణిమ చాలా ప్రత్యేకమైనది ఎందుకంటే ఆరోజు అరుదైన మరో అంశం కూడా జరగబోతోంది. అంటే ఒకేరోజు బుద్ధ పూర్ణిమ చంద్రగ్రహణం కలిసి రాబోతున్నాయి.
2023వ సంవత్సరం మే 5వ తేదీ రాత్రి 8:45 నిమిషాల నుండి రాత్రి 1:00 వరకు చంద్రగ్రహణం ఉంటుంది. మొత్తం నాలుగు గంటల 15 నిమిషాల పాటు చంద్రుడు గ్రహణానికి గురవుతాడు. అయితే ఈ చంద్రగ్రహణంలో మనకి సూతకం ఉండదు. ఎందుకంటే ఈ గ్రహణం భారతదేశం నుంచి కనిపించడం లేదు కాబట్టి. ఇక ఈ మొదటి చంద్రగ్రహణం కారణంగా అన్ని రాశుల మీద కొంత ప్రభావం పడుతుంది. కానీ కొన్ని రోజులు వారికి మాత్రం చాలా ఆసక్తికరమైన వార్తలు తెలిసే అవకాశం ఉంది
మకర రాశి
ముఖ్యంగా మకర రాశి వారి కెరియర్ పుంజుకుంటుందని వారి ఆర్థిక పరిస్థితుల్లో బలం కూడా పెరుగుతుందని అంటున్నారు. ఎవరైనా మకర రాశి వారు వ్యాపారాలు చేయాలనుకుంటే ఆ సమయంలో ప్రారంభిస్తే బాగుంటుందని అంటున్నారు.
కర్కాటక రాశి
ఇక కర్కాటక రాశి వారికి ఈ సామాజిక ప్రతిష్ట బాగా పెరుగుతుందని. అయితే ఈ రాశి వారు ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుందని అంటున్నారు. కుటుంబ సభ్యులందరూ సుఖసంతోషాలతో గడిపే అవకాశం ఈ రాశి వారికి ఉంటుంది.
ఇది కూడా చదవండి: Mesh Sankranti 2023: మేష సంక్రాంతి రోజున మీ రాశి ప్రకారం ఇలా దానం చేస్తే.. మీకు డబ్బే డబ్బు..
ధనుస్సు రాశి
ఇక ధనుస్సు రాశి వారికి అనుకోని శుభవార్తలు అందుతాయి, అందరితో సంబంధాలు ఏర్పడి కుటుంబంతో ఎక్కువగా సమయం గడిపే అవకాశం దక్కుతుందని చెబుతున్నారు.
సింహ రాశి
ఇక సింహ రాశి వారి విషయానికి వస్తే వారికి వ్యాపారంలో మంచి లాభాలు ఏర్పడతాయని, అయితే ఆ రాశి వారికి ఖర్చు కూడా చాలా ఎక్కువగా అవుతుందని చెబుతున్నారు. అనుకోకుండా ప్రయాణాలు చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.
మిధున రాశి
ఇక మిధున రాశి వారికి ఈ చంద్రగ్రహణం చాలా శుభప్రదం, ఎందుకంటే ఈ సమయంలో ఈ రాశి వారు కొత్త వ్యాపారాలు ప్రారంభించవచ్చని, అలాగే వారిలో ఉన్న ఆత్మవిశ్వాసం పీక్ లెవెల్స్ వెళుతుందని అంటున్నారు. అలా ఉండడం వల్ల ఎలాంటి భయం లేకుండా పనిచేసే అవకాశం దక్కుతుందని చెబుతున్నారు.
ఇది కూడా చదవండి: Angaraka Yogam : అంగారక యోగం అంటే ఏమిటి? మీ జాతకంలో ఇది ఏర్పడితే ఏం జరుగుతుందో తెలుసా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook