Bihar Crime: ATMలో డబ్బును నింపేందుకు వచ్చి.. రూ. 1.5 కోట్లతో పరారైన వ్యాన్ డ్రైవర్..

Bihar news: కోటిన్నర రూపాయలతో జంప్ అయ్యాడు ఓ వ్యాన్ డ్రైవర్. ఐసీఐసీఐ బ్యాంకుకు చెందిన నగదును ఏటీఎంలో నింపేందుకు వచ్చిన సెక్యూరిటీ సంస్థ డ్రైవర్.. తొటి సిబ్బంది కళ్లుగప్పి డబ్బుతో ఉడాయించాడు. ఈ ఘటన బీహార్‌ రాజధాని పాట్నాలో చోటుచేసుకుంది.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Apr 11, 2023, 05:12 PM IST
Bihar Crime: ATMలో డబ్బును నింపేందుకు వచ్చి.. రూ. 1.5 కోట్లతో పరారైన వ్యాన్ డ్రైవర్..

Driver robbed of Rs 1.5 crore: ఓ ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీకి చెందిన వ్యాన్ డ్రైవర్..ఐసీఐసీఐ బ్యాంకుకు చెందిన రూ. 1.5 కోట్ల రూపాయలను ఎత్తుకెళ్లాడు. ఈ ఘటన బీహార్‌ రాజధాని పాట్నాలో జరిగింది.  డబ్బును ఐసీఐసీఐ ఏటీఎంలో నింపేందుకు వచ్చి తొటి సిబ్బందిని ఏమార్చి కోటిన్నర రూపాయలతో పరారయ్యాడు డ్రైవర్. ఈ చోరీ అలగ్గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని డంకా ఇమ్లీ ప్రాంతంలో చోటుచేసుకుంది.

సెక్యూర్ వాల్యూ ఇండియా కంపెనీకి చెందిన సిబ్బంది ఐసీఐసీఐ ఏటీఎంలో నగదు నింపేందుకు వెళ్లారు. వ్యాన్ లో రూ. 1.5 కోట్లతో డంకా ఇమ్లీ సమీపంలో బ్యాంక్ ఏటీఎంకు చేరుకున్నారు. ఆ సమయంలో వ్యాన్ లో గన్ మెన్, సంస్థ ఆడిటర్, డ్రైవర్ మాత్రమే ఉన్నారు. ఆడిటర్, గన్ మెన్ కిందకు దిగడంతో ఒక్కసారిగా వ్యాన్ తోపాటు ఉడాయించాడు వ్యాన్ డ్రైవర్. దీంతో సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. వారు డ్రైవర్ ను వెతకడం ప్రారంభించారు. నలంద మెడికల్ కాలేజ్ హాస్పిటల్ దగ్గర ఆ వ్యాన్ పార్క్ చేసి ఉండటాన్ని పోలీసులు గుర్తించారు. అక్కడకు వెళ్లి చూడగా వ్యాన్ లో నగదు లేదు, డ్రైవర్ లేడు. సుత్తితో లాకర్‌ను పగులగొట్టి నగదును బయటకు పోలీసులు గుర్తించారు. డ్రైవర్ సూరజ్ కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు.

Also read: Maharashtra: ఆలయంలో వందేళ్ల నాటి చెట్టు కూలి... ఏడుగురు మృతి, 40 మందికి గాయాలు..

అగంకువాన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని భూత్ నాథ్ రోడ్డులో సెక్యూర్ వాల్యూ ఇండియా కంపెనీ యెుక్క కార్యాలయం ఉంది. పరారైన డ్రైవర్ ఇందులో ఏడాదిన్నర నుంచి పనిచేస్తున్నాడు. దౌలత్ పూర్ కు చెందిన నిందితుడు.. ప్రస్తుతం జహనాబాద్ లోని ఘసి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉంటున్నాడు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. 

Also Read: Bandi Sanjay Phont Theft: నా ఫోన్ పోయింది.. అది పోలీసుల పనే: బండి సంజయ్ 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News