Preity G Zinta About Trolling బాలీవుడ్ మీద ఇప్పుడు సోషల్ మీడియా ఎంతటి వ్యతిరేకతను ప్రదర్శిస్తోందో అందరికీ తెలిసిందే. ఏ చిన్న తప్పులో దొరికినా కూడా బాయ్ కాట్ ట్రెండ్‌తో నెట్టింట్లో వైరల్ అవుతోన్నారు. షారుఖ్, సల్మాన్, ఆమిర్ ఇలా అందరినీ కూడా జనాలు ట్రోల్ చేసేస్తున్నారు. తాజాగా ప్రీతి జింటా తన ఆవేదనను పంచుకుంది. తన మీద జరుగుతున్న ట్రోలింగ్‌ను తిప్పి కొట్టింది. ఓ దివ్యాంగుడు భిక్షం అడిగినా వేయలేదని, కారు వెంటే వస్తున్నా కూడా పట్టించుకోలేదని ఆమె మీద ట్రోలింగ్ జరిగింది. దీనిపై ఆమె స్పందించింది.
ఈ వారంలో రెండు సంఘటనలు నన్ను షాక్‌కు గురి చేశాయి. ఒకటి నా కూతురు జియాతో ఫోటో తీసుకుంటాను అని ఓ మహిళ దగ్గరకు వచ్చింది. వద్దని మర్యాదగా నేను చెప్పాను. సరే అని ఆమె ముందుకు వెళ్లింది..సడెన్‌గా వచ్చి మా పాపను ముద్దు పెట్టుకుని ఎంతో క్యూట్‌గా ఉందని చెప్పి వెళ్లిపోయింది. ఆమె మా అపార్ట్మ్ంట్‌లోనే ఉంటుంది.. మా పిల్లలు ఆడుకునే గార్డెన్ ఏరియాలోనే ఇదంతా జరిగింది. నేను ఆమెను తిట్టొచ్చు.. కానీ సీన్ చేయడం ఎందుకు.. అని కూల్‌గా లైట్ తీసుకున్నాను..
ఇక రెండో సంఘటన ఇదే.. నాకు ఎయిర్ పోర్ట్‌కు టైం అవుతోందని చెప్పాను.. అయినా వినకుండా ఈ దివ్యాంగుడు ఇలా నన్ను అడ్డుకునే ప్రయత్నం చేశాడు.. అతడికి నేను ఎన్నో సార్లు డబ్బులు వేశాను.. అయితే ఈ సారి నా దగ్గర డబ్బుల్లేవు.. క్రెడిట్ కార్డ్ మాత్రమే ఉంది.. అయినా సరే నాతో వచ్చిన మహిళ.. ఎంతో కొంత డబ్బిస్తే.. దాన్ని విసరగొట్టేశాడు.. ఇది సరిపోదంటూ ఇంత కావాలంటూ డిమాండ్ చేశాడు..
మేం కారు ఎక్కి వెళ్తున్నా కూడా ఇలా వెంబడించాడు. ఇదంతా చూస్తూ ఫోటో గ్రాఫర్లు నవ్వుతూ, వీడియోలు తీసుకుంటూ ఉన్నారే తప్పా.. ఇలా చేయడం తప్పు అని అతనికి ఏ ఒక్కరూ చెప్పలేకపోయారు.. వాళ్లకు ఇది ఫన్నీగానే అనిపించొచ్చు.. ఒక వేళ అక్కడ ఏదైనా ప్రమాదం జరిగితే.. నన్నే తిట్టేవాళ్లు.. సెలెబ్రిటీలం కాబట్టి మమ్మల్నే ప్రశ్నిస్తారు. అసలే ఇప్పుడు బాలీవుడ్ మీద అంతా పీకల దాక కోపంతో ఉన్నారు.
మేం కూడా మనుషులమే.. అని జనాలు గుర్తించాలి.. ఆ తరువాతే సెలెబ్రిటీలం. ఈ దేశంలోని ప్రతీ ఒక్కరికి ఎలాంటి హక్కులున్నాయో నాక్కూడా అవి వర్తిస్తాయి.. ఇలా సెలెబ్రిటీల మీద తప్పు తోసేందుకు ప్రయత్నించకండి.. ప్రతీ దానికి రెండు వర్షెన్స్ ఉంటాయి.. రెండు సైడ్స్ మీరు ఆలోచించాలి.. మరీ ముఖ్యంగా మీరు మా పిల్లల్ని కూడా పబ్లిక్ చేయకండి.. మా పిల్లల్ని అలా వదిలేయండి అంతే.. ఫోటోలు తీయడం, ముట్టుకోవడం వంటివి చేయకండి.. ఇంకోసారి వీడియోలు, ఫోటోలు తీసేవాళ్లు ఇలా నవ్వకండి.. ఎందుకంటే ప్రతీసారి అది నవ్వులాటగా ఉండకపోవచ్చు అని ప్రతీ జింటా ఎమోషనల్ అయింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook